గురి చూసి భారత్ రావాల్సిన విమానంపై అమెరికా భారీ దాడి

మానవతా సహాయ మిషన్‌లో భాగంగా న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఇరాన్‌ చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానంపై అమెరికా దాడి చేసింది. మషాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో విమానం దెబ్బతింది. భారత్ కు వెళ్లాల్సిన ప్రణాళికాబద్ధమైన సహాయ కార్యకలాపాలు నిలిచాయి. ఈ ఘటన పట్ల ఇరాన్ స్పందించింది. దీన్ని వార్ క్రైమ్ గా అభివర్ణించింది. భారత్ స్పందించాల్సిన అవసరం ఉందని సూచించింది.

భారత్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న మానవతా సహాయక చర్యల్లో భాగంగా ఈ విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. ఈ విమానం మందులు, వైద్య సామాగ్రిని తరలించాల్సి ఉందని ఇరాన్ తెలిపింది. మషాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికా డ్రోన్లు దీనిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఈ ఫ్లైట్ పాక్షికంగా ధ్వంసమైంది. టేకాఫ్ రద్దయింది. ఈ దాడిపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు. ఇది రెస్క్యూ లాజిస్టిక్స్‌కు విఘాతం కలిగించింది.

US Forces Strike Hits Iranian Civilian Aircraft Bound for India Amid Humanitarian Mission at Mashhad

ఈ సంఘటనపై ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తీవ్రంగా స్పందించింది. దీనిని వార్ క్రైమ్ గా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ మానవతా సహాయక చర్యలను అమెరికా అడ్డుకుందని ఆరోపించింది. ఈ దాడిని భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా తప్పు పట్టింది. దెబ్బతిన్న విమానం అనేక దేశాల నుండి సేకరించిన మందులు, వైద్య పరికరాలను తరలిస్తున్నదని, ఇది మానవతా మిషన్‌లోనే ఉందని స్పష్టం చేసింది.

పౌర విమానంపై దాడితో అమెరికా అంతర్జాతీయ విమానయాన, మానవతా చట్టాల సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించిందని విమర్శించింది. 1944 చికాగో, 1971 మాంట్రియల్ కన్వెన్షన్లను ఇరాన్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ రెండు కన్వెన్షన్లు కూడా యుద్ధ సమయంలో పౌర విమానాలకు ప్రమాదాన్ని కలిగించే చర్యలను అంతర్జాతీయ నేరాలుగా గుర్తిస్తాయి. జెనీవా కన్వెన్షన్స్ అడిషనల్ ప్రోటోకాల్ ఆర్టికల్ 52ను కూడా ఇరాన్ ఉటంకించింది. మానవతా సహాయ విమానాలతో సహా పౌర వస్తువులపై దాడి యుద్ధ నేరాలుగా పరిగణించవచ్చని తెలిపింది.

ఈ ఘటనపై తక్షణ దర్యాప్తు జరిపి, బాధ్యులను విచారించాలని ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చింది. భవిష్యత్తులో పౌర విమానయానానికి ఇలాంటి ఇబ్బందులు రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఇరాన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్‌లలో ఒకటైన మహాన్ ఎయిర్ కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఆంక్షల పరిధిలో ఉంది. వాషింగ్టన్ దీనికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సంబంధాలున్నాయని, ప్రాంతీయ సంఘర్షణలకు సిబ్బందిని రవాణా చేస్తుందని ఆరోపణలు చేస్తూ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+