ఇరాన్‌పై కొత్త ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా...ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకాలు చేశారు. కొత్తగా విధించిన ఆంక్షల ప్రకారం అమెరికా ఆర్థిక సంస్థల నుంచి ఇరాన్ సుప్రీం కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఎలాంటి సహాయం పొందబోరని చెబుతున్న ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన రెండ్రోజులకే ట్రంప్ ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది. చర్యకు ప్రతిచర్యగా ఇరాన్‌పై క్షిపణి దాడికి సిద్ధపడ్డ అగ్రరాజ్యం చివరి నిమిషంలో మనసు మార్చుకుంది.
ఇదిలా ఉంటే ఇరాన్‌తో కానీ ఇతర దేశాలతో కానీ అమెరికా వైరం కోరదని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో అణ్వాయుధాలు కలిగి ఉంటే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ పట్ల అమెరికా ఎంతో ఓర్పుతో సహనంతో వేచిచూసిందని.. ఎప్పుడూ అలానే ఉంటుందనుకోవడం పొరపాటని ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్యకు ప్రతిచర్యగానే ఈ ఆంక్షల నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ అలానే అనుకోవచ్చు అని సమాధానం ఇచ్చారు. ఓ వైపు ఇరాన్‌కు చురకలు అంటిస్తూనే మరోవైపు తెలివిని ప్రదర్శించారు ట్రంప్. న్యూయార్క్‌లో చాలామంది ఇరానీయులు నివసిస్తున్నారని వారంతా మంచి మనుషులని కొనియాడారు.

అమెరికా విధించిన ఆంక్షలతో ఒక్క చర్చలు తప్ప ఇరాన్‌కు మరో ఆప్షన్ లేదని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపే తెలిపారు.వారు చర్చలు జరిపేందుకు అంగీకరించేవరకు ఇరాన్‌పై ఆంక్షలు ఇతర ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని పొంపే చెప్పారు. అంతకుముందు ఇరాన్‌కు బుద్ది చెప్పాలన్న ఉద్దేశంతో అమెరికా కంటిన్జెన్సీ ప్లాన్ రూపొందించింది. దాని ప్రకారం ఇరాన్ దేశ రాకెట్, మిసైల్ లాంఛర్లను నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కంప్యూటర్లను టార్గెట్ చేసింది. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికా అధికారులు శత్రువులను ఎక్కువగా సైబర్ రంగంలోనే లక్ష్యంగా చేసుకున్నారు.
-
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
షాక్: స్టూడెంట్ వీసాల్లో 60 శాతం కోత: భారత్ జోరుకు ట్రంప్ బ్రేకులు.. -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక!











Click it and Unblock the Notifications