వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘చైనా సైనికులు ఎంత మంది చనిపోయారో తెలిసేది మరో 50ఏళ్ల తర్వాతే’

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్-చైనా సైన్యాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సుమారు 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే, చైనా వైపు ఎంత మంది ఆ దేశ సైనికులు హతమయ్యారనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.

భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్‌నాథ్ సింగ్ భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్‌నాథ్ సింగ్

35 మంది చైనా సైనికులు హతం

35 మంది చైనా సైనికులు హతం


ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రటకన చేసింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది సైనికులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ప్రీఫైన్‌జర్నల్ తన కథనంలో వెల్లడించింది. కాగా, ఈ విషయం భారత వార్త సంస్థ పీటీఐలో కూడా వచ్చింది.

చైనా ఎప్పుడూ దాచేయడమే..

చైనా ఎప్పుడూ దాచేయడమే..

ఐదు దశాబ్ధాల్లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టాలను చైనా దాచిపెడుతూ వస్తోందని తెలిపింది. ఈ ఆయుధ రహిత ఘర్షణలో ప్రాణ నష్టం వివరాలను చైనా కొన్ని దశాబ్దాల తర్వాత విడుదల చేయవచ్చని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చైనా విభాగం నిపుణుడు టేలర్ ఫార్వెల్ చురకలంటించారు. 1962 యుద్ధంలో మరణించిన వారి వివరాలను 1994లో అంతర్గత చరిత్రలో ప్రచురించిందని తెలిపారు.

అమెరికా మీడియాలోనూ కథనాలు

అమెరికా మీడియాలోనూ కథనాలు

అమెరికా ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం దాదాపు 35 మంది చైనా సైనికులు చనిపోయారు. వీరిలో ఒక సీనియర్ అధికారి కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అక్కడ నుంచి బలగాల ఉపసంహరణపై సమావేశం జరుగుతుండగానే ఈ ఘర్షణ చోటు చేసుకుందని యూఎస్ న్యూస్.కామ్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం పేర్కొంది.

Recommended Video

#IndiaChinaFaceOff : 20 మంది Indian Soldiers వీర మరణం పై సినీ ప్రముఖుల సంతాపం!
కత్తులు, కర్రలతో దాడులు.. చైనా కుట్రలు

కత్తులు, కర్రలతో దాడులు.. చైనా కుట్రలు

ఈ ఘర్షణలో కత్తులు, కర్రలు వాడినట్లు తెలిసిందని వెల్లడించింది. ఇందులో ప్రాణ నష్టాన్ని బీజింగ్ తమ సైనిక దళాలకు జరిగిన అనుమానంగా భావిస్తోందని ఆ కథనంలో వెల్లడించింది. ఇరువైపులా ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోవడమో, గాయపడటమో జరిగినట్లు ఏఎన్ఐ తన కథనంలో పేర్కొంది. చైనీయుల కమ్యూనికేషన్లు ఇంటర్ సెఫ్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు పేర్కొంది. కాగా, శాంతి చర్చలు జరుపుతామంటూనే చైనా దాడులకు దిగడంపై ప్రపంచ దేశాల మీడియా కూడా ఎండగట్టాయి. ఇరు దేశాలు చర్చలతోనే సరిహద్దులో శాంతిని నెలకొల్పాలని సూచిస్తున్నాయి.

English summary
A day after a violent face-off between Indian and Chinese armies in the Galwan valley, sources said that US intel believes that 35 PLA soldiers died, including a senior officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X