"మమ్మల్నే బ్యాన్ చేస్తారా?" - ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన మీడియా సంస్థలు..!

ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికాలో, తమ దేశాధ్యక్షుడిని మూడు మీడియా సంస్థలు (US Media Outlets) కోర్టుకీడ్చాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో తమకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును వాడుకుంటూ మూడు ప్రధాన మీడియా సంస్థలు ట్రంప్ కు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. అంతే కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా కోర్టులో దావా వేశాయి. దీంతో ఈ వ్యవహారం అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో చర్చనీయాంశమవుతోంది.

హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!
హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!

ఇలా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పై కోర్టులో దావా వేసిన మీడియా సంస్థల్లో ప్రఖ్యాత సీఎన్ఎన్ వార్తా సంస్థతో పాటు ఎంఎస్ నౌ, పొలిటికో ఉన్నాయి. ఇంతకీ ఈ మూడు మీడియా సంస్థలు ట్రంప్ ప్రభుత్వంపై ఎందుకు న్యాయపోరాటానికి దిగాయో తెలుసా ? అధ్యక్ష నివాసం అయిన వైట్ హౌస్ లోకి తమ మీడియా ప్రతినిధుల్ని రాకుండా నిషేధం విధించినందుకు ఈ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి తమ ప్రతినిధుల్ని రానివ్వకుండా ఎలా అడ్డుకుంటారని అవి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ట్రంప్ కు ఏం చెప్పాలో తెలియని పరిస్ధితి.

US media outlets to sue Donald trump administration over white house access ban
అంతర్జాతీయ కోర్టుకు అనూహ్య షాక్..! ట్రంప్ కీలక అడుగులు..!
అంతర్జాతీయ కోర్టుకు అనూహ్య షాక్..! ట్రంప్ కీలక అడుగులు..!

ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నాయనే కారణంతో సీఎన్ఎన్ వార్తా సంస్థతో పాటు ఎంఎస్ నౌ, పొలిటికో పై వైట్ హౌస్ లోకి అడుగుపెట్టకుండా ట్రంప్ నిషేధం విధించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయా మీడియా సంస్థలు.. తాము ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేస్తున్నట్లు వైట్ హౌస్ కు సమాచారం ఇచ్చాయి. తమ ఫస్ట్ అమెండ్ మెంట్ హక్కుల్ని కాపాడుకునేందుకు, అలాగే వైట్ హౌస్ లోకి వచ్చే మీడియా ప్రతినిధుల్ని ట్రంప్ సర్కార్ ఎంపిక చేసుకునే హక్కును సవాల్ చేస్తూ తాము ఉమ్మడిగా ఈ దావా వేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఇప్పుడు కోర్టులో ఆయా సంస్థల్ని ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారనే కారణంతో తాము అడ్డుకున్నామని ట్రంప్ సర్కార్ వాదించుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+