ఉత్తరకొరియాకు ఇక విశ్వరూపమే: ట్రంప్, గువాం ద్వీపంపై యుద్ధవిమానాల పహారా

అమెరికా అత్యంత అప్రమత్తంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే.. యుద్ధానికి సంసిద్ధంగా ఉంది. ఉత్తర కొరియా ఏమాత్రం తోక జాడించినా కత్తిరించాలనే కృత నిశ్చయంతో ఉంది.

వాషింగ్టన్‌: అమెరికా అత్యంత అప్రమత్తంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే.. యుద్ధానికి సంసిద్ధంగా ఉంది. ఉత్తర కొరియా ఏమాత్రం తోక జాడించినా కత్తిరించాలనే కృత నిశ్చయంతో ఉంది.

ఈ నేపథ్యంలో పసిఫిక్‌ మహాసముద్రంలోని గువాం ద్వీపం పైన అమెరికా యుద్ధవిమానాలు పహారా కాశాయి. గువాంపై అణుదాడికి ప్రణాళిక రచిస్తున్నామని ఉత్తరకొరియా ప్రకటించక మునుపే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యాయి.

US and North Korea on brink of war as Trump flies supersonic B-1B bombers from threatened island of Guam

ఈ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాదాపు 10 గంటల పాటు అమెరికాకు చెందిన సూపర్‌సోనిక్‌ బాంబర్‌ జెట్లు గువాం మీదుగా పలుమార్లు గాల్లో చక్కర్లుకొట్టాయి.
ఎక్కడ దాడి జరిగినా అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

దీనికోసమే 10 గంటలపాటు పైలట్లు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. ఉత్తరకొరియా ఆలోచనను ముందుగానే పసిగట్టిన అగ్రరాజ్యం ప్రత్యర్థిని తోకముడిచేలా చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

''అమెరికా విశ్వరూపాన్ని చూపిస్తుంది''

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ యుద్ధమంటూ సంభవిస్తే.. అమెరికా విశ్వరూపాన్ని ఉత్తరకొరియా చూస్తుందని అన్నారు. దక్షిణ కొరియా, జపాన్‌ లతో సమావేశం జరిగిన తర్వాత ట్రంప్‌ న్యూ జెర్సీలో ఉత్తరకొరియాపై ఈ మేరకు వ్యాఖ్యానించారు.

గువాం గవర్నర్‌ కూడా యుద్ధంలో అమెరికా గెలుస్తుందని బుధవారం వ్యాఖ్యానించారు. గువాంపై దాడి చేసేందుకు ఉత్తరకొరియా దాదాపు 60 న్యూక్లియర్‌ వార్ హెడ్‌లను సిద్ధం చేసినట్లు అమెరికా అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+