వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్ యూఎస్ దాడి దర్యాప్తులో సంచలనం-పిల్లల ఆనవాళ్లు మాయం, కుట్రకూడా లేదట

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది ఆగస్టు 29న కాబూల్ పై యూఎస్ సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో భారీగా పౌరులు చనిపోయారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ దీనిపై జరిగిన దర్యాప్తు తాజాగా పూర్తయి నివేదిక వచ్చింది. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి.

కాబూల్ పై యూఎస్ జరిపిన డ్రోన్ దాడిలో పౌరులు చనిపోవడం నిజమే అయినా చిన్నారులు మాత్రం లేరని దర్యాప్తు నివేదిక వెల్లడించింది. అలాగే ఈ దాడిలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని కూడా దర్యాప్తు తేల్చింది. యూఎస్ మిలిటరీ ఇన్ స్పెక్టర్ జనరల్ నిర్వహించిన ఈ దర్యాప్తులో పలు సంచలన అంశాలు దర్శనమిచ్చాయి. గతంలో ఈ దాడి తీవ్రమైన పొరబాటుగా చెప్పిన యూఎస్ అధికారులు.. ఇప్పుడు మాత్రం ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఐసిస్ ఆత్మాహుతి దళ సభ్యుడిని టార్గెట్ చేసుకుని మాత్రమే ఈ దాడి జరిగినట్లు పెంటగాన్ పేర్కొంది. ఈ దాడికి ముందు ఐసిస్ జరిపిన దాడిలో 10 మంది యూఎస్ సైనికులు చనిపోయారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ప్రకటించింది.

US probe on kabul strike missed evidence of child present, says no criminal negligence

యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ చేసిన దర్యాప్తు ప్రకారం, దాడి అమలులో లోపాలు, నిర్దిష్ట దృక్కోణాలకు మద్దతు ఇచ్చే సమాచారాన్ని వివరించడం, కమ్యూనికేషన్ బ్రేక్‌డౌన్‌ల కారణంగా ఇది చోటు చేసుకున్నట్లు తన నివేదికలో తెలిపారు.
ఇది విచారించదగిన తప్పని, ఇది నిజాయితీగల తప్పని కూడా ఎయిర్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సమీ తాజాగా మీడియాకు వివరించారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టు బయట తాము చేసిన దాడిని అమెరికా మరోసారి సమర్ధించుకున్నట్లయింది. గతంలో ఈ దాడిని పొరబాటుగా పేర్కొన్న యూఎస్ సైన్యం.... ఇప్పుడు మాత్రం ఇందులో కుట్ర లేదని చెప్పడం ద్వారా దాడి సమంజసమేనని చెప్పినట్లయింది.

English summary
the probe on US drone attack in kabul on august 29 this year found that there is no criminal negligence from american side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X