మేం దిగితే.. వెనుదిరిగే సమస్యే లేదు, ఆ తరువాత మీ ఇష్టం: ఉత్తరకొరియాపై ట్రంప్
వాషింగ్టన్: క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తున్న ఉత్తరకొరియాపై సైనిక చర్యకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
తమ దేశాల సరిహద్దుల సమీపంలో ఎగిరే అమెరికా బాంబర్లను కూడా కూల్చేస్తామని ఉత్తరకొరియా విదేశాంగశాఖ మంత్రి రి యాంగ్ హో ప్రకటించిన మర్నాడే ట్రంప్ ఈ విధంగా స్పందించారు.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రవర్తన బాగోలేదని ట్రంప్ మండిపడ్డారు. ఆ దేశం చేపట్టే క్షిపణి ప్రయోగాల కారణంగా ఊహించని స్థాయిలో ప్రపంచంలోని చాలా దేశాలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నారు.

ఇటీవల ఉ.కొరియాపై ఆంక్షలు విధించిన చైనాను ట్రంప్ అభినందిస్తూ.. జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, బాధ్యతగల దేశాలన్నీ చేతులు కలిపి ఉత్తరకొరియాను అణురహితంగా మార్చాలని కూడా ట్రంప్ అన్నారు.
''రెండో పరిష్కార మార్గానికి (సైనిక చర్య) కూడా మేం సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఆ మార్గాన్ని ఎంచుకోవాలని అనుకోవట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ మార్గాన్ని ఎంచుకుంటాం.. మేం గనుక ఒకసారి దిగితే.. పని పూర్తయ్యేదాక వెనుదిరిగే సమస్యే లేదు..'' అని ట్రంప్ ఓ మీడియా సమావేశంలో ప్రకటించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!