విదేశీ విద్యార్ధులకు అమెరికా బిగ్ షాక్- ఏకంగా 6 వేల వీసాల రద్దు..!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసదారులతో పాటు విదేశీ విద్యార్దులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. వారిని సాగనంపేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోవడం లేదు. ఇప్పటికే కొత్తగా జారీ చేసే వీసాలు, గ్రీన్ కార్డులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్న ట్రంప్.. ప్రస్తుతం వీసాలు, గ్రీన్ కార్డులు కలిగిన వారిని కూడా వదలడం లేదు. ఇదే క్రమంలో తాజాగా భారీ ఎత్తున విదేశీ విద్యార్ధులకు ట్రంప్ సర్కార్ షాకిచ్చింది.

వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, ఆ దేశ చట్టాల్ని ఉల్లంఘించడం, తీవ్రమైన నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడటం వంటి కారణాలు చూపుతూ ట్రంప్ సర్కార్ ఏకంగా 6 వేల మంది విదేశీ విద్యార్ధుల వీసాల్ని రద్దు చేసింది. ఇందులో మూడింటి రెండొంతుల మంది నేరుగా నేరాలు చేసిన వారే ఉన్నట్లు తేల్చారు. దీంతో ఈ నాలుగు వేల మంది వీసాలు రద్దయ్యాయి. తీవ్రవాదం, తీవ్రవాదానికి మద్దతు వంటి ఆరోపణలపై 200 నుంచి 300 అంతర్జాతీయ విద్యార్ధి వీసాల్ని రద్దు చేశారు.

US Revokes 6 000 International Student Visas Citing Legal Violations

అయితే ఇలా భారీ ఎత్తున అంతర్జాతీయ విద్యార్ధి వీసాలు రద్దు చేసి వెనక్కి పంపుతున్నా.. వారంతా ఏయే దేశాల వారు అన్న వివరాలు మాత్రం ప్రభుత్వం బయటపెట్టడం లేదు. అలాగే ఇలా వీసాలు రద్దయిన వారు ఇంకా అమెరికాలో ఉన్నారా లేదా అన్న వివరాలు కూడా ఇవ్వడం లేదు. జాతీయ భద్రతా కోణంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ వీసాలు రద్దయినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే విద్యార్థి వీసాల దుర్వినియోగం కారణంగా వీటిని రద్దు చేయలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+