కరోనా వైరస్‌ పుట్టింది వుహాన్‌ ల్యాబ్‌లోనే- అమెరికా సర్కార్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌-వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌

కరోనా వైరస్ పుట్టుకపై ఓవైపు ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా బృందాల సంయుక్త అధ్యయనం కొనసాగుతున్న నేపథ్యంలో సొంతంగా దర్యాప్తు చేపట్టిన అమెరికా... వుహాన్‌ ల్యాబ్‌ నుంచే ఈ వైరస్‌ పుట్టిందనడానికి మరిన్ని ఆధారాలు సేకరించింది. అమెరికా ప్రభుత్వ జాతీయ ప్రయోగశాల నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు నిర్ధారణకు వచ్చింది.

Recommended Video

    COVID Origins పై Joe Biden సంచలన ఆదేశాలు Wuhan Lab | China గుట్టు 90 రోజుల్లో ? || Oneindia Telugu

    తాజాగా అమరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం అమెరికా జాతీయ ప్రయోగశాల నిర్వహించిన అధ్యయనంలో కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే నిర్దారణకు వచ్చింది. అయితే దీనిపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. ఈ వివరాలను బైడెన్‌ సర్కారుకు జాతీయ ప్రయోగశాల సమర్పించింది. గతేడాది మే నెలలో కాలిఫోర్నియాలోని లారెన్స్‌ లివర్‌మోర్‌ జాతీయ ల్యాబొరేటరీ ఈ అధ్యయనం ప్రారంభించింది. అప్పటి ట్రంప్‌ సర్కార్‌ ఆదేశాల మేరకు ఈ అధ్యయనం చేపట్టారు. దీని ఫలితాలు ఇప్పుడు వెలువడ్డాయి.

    US Study Concluded Covid-19 May Have Leaked from Wuhan Lab: Report

    కరోనా వైరస్ జన్యువులపై జాతీయ ప్రయోగశాల అధ్యయనం చేసి ఈ ఫలితాలు వెల్లడించినట్లు ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. అయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంపై స్పందించేందుకు లారెన్స్‌ లివర్‌మోర్ ల్యాబోరేటరీ వర్గాలు నిరాకరిస్తున్నాయి. వాస్తవానికి కరోనా వైరస్ మూలాలు కనుక్కోవాలని అధికారుల్ని అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు ఇచ్చారు. అమెరికా ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాణాంతక వైరస్‌ ల్యాబ్‌లో పుట్టడం కానీ, లేదా ఓ జంతువు నుంచి మనిషికి సోకడం కానీ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో ఏ ఒక్క అంశాన్నీ నిఘా వర్గాలు నిర్ధారించడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+