Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ చాలా టఫ్! త్వరలోనే భారత్‌తో అమెరికా బిగ్ డీల్

భారత్ - అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న వేళ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని తెలిపరాు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ చాలా టఫ్​ నెగోషియేటర్ అని వ్యాఖ్యానించారు. మోడీ చాలా బాగా బేరసారాలు చేస్తారని, అందుకే తాము ఆయనను గౌరవిస్తామని జేడీ వాన్స్​ అన్నారు.

US trade deal with India soon JD Vance

'భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల, అమెరికా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే భారత్‌ మాత్రం తమ దేశం నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రయోజనం పొందుతోంది' అని జేడీ వాన్స్​ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో అమెరికన్ వస్తువులకు కొత్త మార్కెట్లను తెరవడం, కార్మికులకు హాని కలిగించే అన్యాయమైన పద్ధతులను తొలగించడం మొదలైన విషయాలపై భారత్‌తో చర్చిస్తున్నామని జేడీ వాన్స్ వివరించారు.

వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌తో పాటుగా జపాన్‌, కొరియా తదితర దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని వాన్స్‌ వెల్లడించారు. కాగా, ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్‌.. ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రేడ్​ డీల్​ కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ఇరుదేశాల నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు.

వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్‌ల దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్‌ కూడా భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజాగా, జేడీ వాన్స్ ప్రకటనతో త్వరలోనే భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+