ట్రంప్ మరో బాంబు: 'ముస్లిం' దేశాలపై ఆంక్షలు, బ్రిటన్ కూడా ఫాలో అయింది!

అమెరికా తరహాలోనే బ్రిటన్ సైతం 14దేశాలకు చెందిన విమానయాన సంస్థలపై ఆంక్షలు విధించింది.

వాషింగ్టన్/లండన్: అమెరికా గడ్డపై విదేశీ వలసలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో భాగంగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. నిన్నటిదాకా ట్రావెల్ బ్యాన్ పైనే గగ్గోలు పెట్టిన జనాలు.. తాజాగా ప్రకటించిన ఆంక్షలతో మరింతగా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ట్రావెల్ బ్యాన్ తరహాలోనే ఇకనుంచి ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల 'లగేజీ' విషయంలో పలు ఆంక్షలు విధించారు.

ఈ ఆంక్షలు కైరో(ఈజిప్టు), అబుదాబీ(యూఏఈ), ఇస్తాంబుల్(టర్కీ),దోహ(ఖతర్), అమ్మన్(జోర్డాన్), కువైట్ సిటీ, కాసాబ్లాంకా(మొరాకో), జెడ్డా, రియాద్(సౌదీ అరేబియా) నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులకు వర్తిస్తాయి. జాబితాలో ఉన్న దేశాల్లోని విమానయాన సర్వీసులకు మంగళవారం నాడు దీనికి సంబంధించిన నోటీసులు అందజేశారు.

 ఆంక్షలు విధించిన 'ఎయిర్ లైన్స్' జాబితా:

ఆంక్షలు విధించిన 'ఎయిర్ లైన్స్' జాబితా:

ఈ మేరకు ఎతిహాద్ ఎయిర్ వేస్, ఈజిప్టు ఎయిర్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్, ఖతర్ ఎయిర్ వేస్, రాయల్ ఎయిర్ మొరాక్, రాయల్ జోర్డానియన్ ఎయిర్ లైన్స్, కువైట్ ఎయిర్ వేస్, సౌదీ అరేబియన్ ఎయిర్ లైన్స్, టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానయాన సంస్థలకు ఈ తాజా నిబంధనలు వర్తించనున్నాయి. నోటీసులు జారీ చేసిన 96గంటల్లోగా ఈ కొత్త నిబంధనలు అమలులోకి తేవాలని అమెరికా ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఆయా విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిబంధనల వల్ల నష్టమేంటి?

ఈ నిబంధనల వల్ల నష్టమేంటి?

తాజా నిబంధనలతో ఒక్క మెడికల్ పరికరాలు మినహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమాన క్యాబిన్ లోకి అనుమతించరు. జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఉగ్రదాడులను నియంత్రించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కొత్త ఆంక్షలను తీసుకొచ్చినట్లు అమెరికా చెబుతోంది.

ఈ నిబంధనలు అమలులోకి వస్తే.. స్మార్ట్ ఫోన్ కంటే పెద్దవైన ఐపాడ్స్, కిండల్స్, ల్యాప్ టాప్ లు వంటి పరికరాలను సదరు ప్రయాణికులు సెక్యూరిటీ లేదా బోర్డింగ్ సమయానికి కంటే ముందే అందజేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తీసుకొచ్చే ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరమైన దాన్ని కార్గోలోనే ఉంచుతారు.

ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంతో పేలుడు పదార్థాల రవాణా జరిగే అనుమానముందని భావిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది.

భారతీయులకు ఇబ్బందే:

భారతీయులకు ఇబ్బందే:

ఇండియా నుంచి అమెరికా వెళ్లే చాలామంది ప్రయాణికులు అబుదాబీ, దుబాయ్, ఇస్తాంబుల్ మీదుగా ప్రయాణిస్తుంటారు. దీంతో తాజా ఆంక్షలు వీరిని ఇబ్బందికి గురిచేయనున్నాయి. ఇండియా నుంచి నేరుగా అమెరికా వెళ్లేవారికి ఎలాంటి ఆంక్షలు వర్తించవు. ఎయిర్ ఇండియా విమానాలు నేరుగా అమెరికా వెళ్తాయని, అందువల్ల తమ ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆ సంస్థ ప్రకటించింది.

బ్రిటన్ లోను ఆంక్షల పర్వం:

బ్రిటన్ లోను ఆంక్షల పర్వం:

అమెరికా తరహాలోనే బ్రిటన్ సైతం 14దేశాలకు చెందిన విమానయాన సంస్థలపై ఆంక్షలు విధించింది. టర్కీ, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు, ట్యునిసియా, సౌదీ అరేబియాకు చెందిన 14విమానయాన సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ దేశాల నుంచి బ్రిటన్ కు వచ్చే విమానాల్లోకి సాధారణ పరిణామాన్ని మించి ఉండే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని బ్రిటన్ ప్రకటించింది.ఆ వస్తువులను క్యాబిన్ బ్యాగేజీ ద్వారా కాకుండా ముందుగానే అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+