
Viral news: ఇళ్ళు ఊడ్చేవారికి లక్షల్లో శాలరీ; ఏడాదికి కోట్లలో ప్యాకేజీలు; ఎక్కడో తెలుసా!!
అక్కడ ఇళ్లల్లో పనిచేసే వారికి, పారిశుద్ధ్య కార్మికులకు లక్షల్లో జీతాలు ఉన్నాయి. సంవత్సరానికి వారు భారతదేశంలో డాక్టర్లు, ఇంజనీర్లు సంపాదించిన డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పారిశుద్ధ్య కార్మికుల కొరత ఆ దేశంలో ఆకాశాన్నంటుతున్న జీతాలకు కారణంగా మారింది. అసలు ఇంతకీ పారిశుద్ధ్య కార్మికులకు ఇంత డిమాండ్ ఉన్న దేశం ఏది అంటే.. ఆస్ట్రేలియా.

ఆస్ట్రేలియాలో పారిశుధ్య కార్మికుల కొరత.. అమాంతం పెరిగిన వారి జీతాలు
ఆస్ట్రేలియా దేశంలో 2021 నుంచి పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉంది. మనదేశంలో డాక్టర్లు, ఇంజనీర్లకు ఇచ్చే ఒక నెల జీతం కంటే, అక్కడ పనిచేసే ఒక పారిశుధ్య కార్మికులకు జీతం ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియాలో, పారిశుధ్య కార్మికుల డిమాండ్ దాదాపు ఆల్ టైమ్ హైలో ఉంది. వాస్తవానికి, దేశంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా అనేక క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీలు తమ కార్మికుల జీతాన్ని విపరీతంగా పెంచేశాయి.

కోటి రూపాయల వరకు వారికి ప్యాకేజీలు ఇస్తున్న సంస్థలు
ఆశ్చర్యకరంగా వారి జీతం ప్యాకేజీలలో కొన్ని రూ. 1 కోటి రూపాయలను తాగుతున్నాయి అంటే అక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియాలో పారిశుద్ధ్య కార్మికులు దొరకడం అంత సులభం కాదు. కాబట్టి కార్మికుల కొరత పరిస్థితిని ఎదుర్కోవటానికి, చాలా కంపెనీలు క్లీనింగ్ కార్మికుల జీతాన్ని గంటల ప్రాతిపదికన పెంచాయి. వారు ప్రతి నెలా సగటున 8,00,000 రూపాయల జీతం పొందుతున్నారు. వారి సగటు జీతం ప్యాకేజీ రూ. 72,00,000 నుండి రూ. 80,00,000 వరకు ఉంటుంది. అయితే చాలా కంపెనీలు దానిని రూ. 98,00,000కి పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి.

గంటకు 45 డాలర్ల చొప్పున జీతం
డెయిలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, సిడ్నీకి చెందిన క్లీనింగ్ కంపెనీ అబ్సొల్యూట్ డొమెస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జో వెస్ మాట్లాడుతూ, శుభ్రం చేయడానికి వ్యక్తులు లేనందున ఉద్యోగుల జీతం పెంచవలసి వచ్చింది. ఇప్పుడు క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ జీతం గంటకు 45 డాలర్లకు (గంటకు రూ. 3600) పెంచబడిందని పేర్కొన్నారు. 2021లో ఒక పారిశుద్ధ కార్మికుడు గంటకు రూ. 2700 పొందే చోట, ఇప్పుడు రూ. 3500 నుండి 3600 అందిస్తున్నారు.

గంటకు రూ.4700 లేదా అంతకంటే ఎక్కువ పెంచడానికి కూడా రెడీ అయిన కంపెనీలు
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలోని ఇతర కంపెనీలదీ అదే పరిస్థితి అని చెప్పొచ్చు. కొన్ని కంపెనీలు గంటకు రూ. 4700 లేదా అంతకంటే ఎక్కువ పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. కాలువలను శుభ్రం చేయడానికి సంవత్సరానికి రూ. 82 లక్షల వరకు అందించబడుతోంది. బ్రిటన్‌లో చూసినట్లయితే అక్కడ పారిశుద్ధ్య కార్మికులు పంట పొలాల నుండి క్యాబేజీని కోసినందుకు మాత్రమే సంవత్సరానికి రూ.65,00,000 జీతం ఇస్తున్నారు.