వైరల్ వీడియో: క్లోజ్ ఫ్రెండ్‌షిప్.. పుతిన్ సారు, కిమ్ మామ దోస్తీ మామూలుగా లేదు!
Viral Video: చైనా రాజధాని బీజింగ్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) సమావేశం తర్వాత ఇప్పుడు చైనా నిర్వహించిన సైనిక పరేడ్‌లో ప్రపంచ నాయకులు పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేకంగా నిలిచారు.
పుతిన్, కిమ్‌ల మధ్య రహస్య సమావేశం
ఈ సైనిక పరేడ్ తర్వాత వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య బీజింగ్‌లోని దియావోయుతాయ్ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో దాదాపు రెండున్నర గంటల పాటు రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కిమ్ తన సోదరి కిమ్ యో జొంగ్, కుమార్తె కిమ్ జు ఏతో కలిసి వచ్చారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరు నేతలు కలుసుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కారులో కూర్చోవడానికి ఇద్దరూ ఒకరికొకరు 'ముందు మీరు.. ముందు మీరు' అని గౌరవం ఇచ్చుకోవడం అందరినీ ఆకర్షించింది. లక్నోలో అతిథులకు ఇచ్చే గౌరవాన్ని పోలి ఉన్న ఈ సంఘటనను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

JUST IN: 🇷🇺🇰🇵 President Putin officially invites North Korean President Kim Jong Un to Russia. pic.twitter.com/Mg4lh7vcCK
— BRICS News (@BRICSinfo) September 3, 2025
ఈ కీలక సమావేశం ముగిసిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్‌ను ఆలింగనం చేసుకుని త్వరలో కలుద్దామని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా, పుతిన్ కిమ్‌ను రష్యాకు రావాలని ఆహ్వానించారు. "మేము మీ కోసం ఎదురుచూస్తాము, రష్యాకు రండి" అని పుతిన్ అన్నారు. ఈ ఆత్మీయ దృశ్యాలు, ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహాన్ని, గౌరవాన్ని తెలియజేస్తున్నాయి.
JUST IN: 🇷🇺🇰🇵 Russian President Putin and North Korea's President Kim Jong Un ride together in the same car. pic.twitter.com/EqP3JDvYKy
— BRICS News (@BRICSinfo) September 3, 2025
మరోవైపు ఉక్రెయిన్ ఆక్రమించుకున్న క్రస్క్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ చేసిన సాయానికి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ యుద్ధం రష్యా సేనలకు అండగా ఉత్తర కొరియా దళాలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. కిమ్ దాదాపు 11 వేల మంది సైనికులను ఇక్కడికి పంపారు.












Click it and Unblock the Notifications