వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: పిల్లల కోసం తల్లి చేసిన సాహసం.. వైరల్ గా మారిన వీడియో..

|
Google Oneindia TeluguNews

తల్లి.. తన ప్రాణాల కంటే బిడ్డ ప్రాణాలే ఎక్కువ అనుకుంటుంది. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు తన బిడ్డ ప్రాణాలు దక్కాలనుకుంటుంది. ఇలానే ఓ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన సాహసం ఔరా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ మెక్సికోలో ఓ తల్లి తన పిల్లలను కిడ్నాప్ చేయకుండా కాపాడే తీరు తల్లీ మనస్సు ఎంత గొప్పదో చాటి చెబుతోంది. పిల్లలను కాపాడుకోవడానికి ఆమె కారు పైకి దూకే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కిడ్నాప్

కిడ్నాప్

అమెరికాలోని న్యూ మెక్సికోలో మెలోడీ మాల్డోనాడో 33 నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఒక రోజు న్యూ మెక్సికోలోని ఒక కన్వీనియన్స్ స్టోర్ వెలుపల తన తెల్లని హ్యుందాయ్ శాంటా ఫేని పార్క్ చేసింది. ఆమె తన ఆరేళ్ల కుమార్తె, 11-నెలల కొడుకును కారులోనే ఉంచింది. స్టోర్ కు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మరో మాల్డోనాడోను తోసేసి కారుతో పరారయ్యే ప్రయత్నం చేసింది. కానీ మాల్డోనాడో వెనకుడుగు వేయకుండా కారు ముందటి భాగంపై దూకింది.

పోలీసులకు సమాచారం

పోలీసులకు సమాచారం

కారును అలానే గట్టిగా పట్టుకుని ఉంది. కానీ చివరికి కింద పడిపోయింది."ఆమె డ్రైవింగ్ చేస్తూనే ఉంది. మేము చాలా దూరం వెళ్లాం. చివరికి నేను పడిపోయాను.దుకాణానికి తిరిగి పరుగెత్తి, పోలీసులను పిలవమని ఒక అకౌంటెంట్‌ను అడిగాను" అని వివరించింది."కారుకు ఏమి జరిగిందో నేను పట్టించుకోలేదు. నేను నా పిల్లలను తిరిగి కోరుకుంటున్నాను "అని చెప్పింది. చివరకు హోబ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కారును గుర్తించగలిగింది.

నిందితురాలిపై ఇప్పటికే అనేక కేసులు

పోలీసులు వెంబడిస్తున్నారని తెలిసిన నిందితులు కారుతోపాటు పిల్లలను వదిలిపెట్టి పరారయ్యారు. పోలీసులు చివరికి నిందితురాలిని పట్టుకున్నారు. ఆమెపై ఇప్పటికే మూడు యాక్టివ్ అరెస్ట్ వారెంట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. "ఆమెను ఆపమని, నా పిల్లలు కారులో ఉన్నారని నేను అరిచాను" అని మాల్డోనాడో గుర్తు చేసుకుంది.

English summary
Dramatic footage captures a New Mexico Mom jumping onto the hood of her own car in a desperate bid to save her children from being kidnapped. ​​Melody Maldonado had parked her white Hyundai outside a store but returned only for a woman to drive off with the vehicle while the kids were still inside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X