పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అల్లకల్లోలం: స్వాతంత్ర్య డిమాండ్ ఉద్ధృతం!
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. కనీసం 38 డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. సైన్యం అణచివేతకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఇప్పుడు ఆజాదీ(స్వాతంత్య్రం ) డిమాండ్‌గా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల దమననీతికి వ్యతిరేకంగా ముజఫరాబాద్, రావల్కోట్, నీలం లోయ, కోట్లి వంటి ప్రాంతాలలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
రక్తపాతం: 12 మంది పౌరులు మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇటీవల సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున అశాంతిని ఎదుర్కొంటోంది. ఈ నిరసనలు మొదట్లో 38 కీలక డిమాండ్ల వైఫల్యంపై ప్రారంభమై ఇప్పుడు సైన్యం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమంగా మారాయి. ఆందోళన మూడో రోజున పాక్ సైన్యం కాల్పులు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముజఫరాబాద్, ధీర్‌కోట్, దదయాల్ ప్రాంతాలకు చెందిన కనీసం 12 మంది పౌర నిరసనకారులు మరణించారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు.. నినాదాలు
జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (AAC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు ఇవే:
*పాకిస్తాన్‌లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం పీవోకే అసెంబ్లీలో రిజర్వ్ చేయబడిన 12 సీట్లను రద్దు చేయాలి.
*పన్నులలో ఉపశమనం (Tax Relief), గోధుమ పిండి, విద్యుత్‌పై సబ్సిడీ ఇవ్వాలి.
*అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి.
*నిరసనకారులు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ , తమకు ఆజాదీ (స్వాతంత్ర్యం) కావాలని, కాశ్మీర్ విముక్తి అవుతుందని నినదిస్తున్నారు.
PoK on fire 🔥Citizens rally for their rights, but Pakistan cuts the internet. Tyranny goes offline, yet the anger goes viral. POJK's merge with India is just a matter of time. #PoJKProtest #Pok pic.twitter.com/LZcW6y2yNF
— Aisha Siddiqui (@its_aisha23) October 1, 2025
వారి ప్రధాన నినాదాలు:
*హమ్ తుమ్హారీ మౌత్ హై (చూసుకోండి, మేము మీ చావులం)
*ఇంక్విలాబ్ ఆయేగా (విప్లవం వస్తుంది)"
"కాశ్మీర్ మాది, దాని భవిష్యత్తును మేమే నిర్ణయిస్తాం
'ప్రభుత్వం దెయ్యంగా మారింది' - AAC నాయకుడు
అవామీ యాక్షన్ కమిటీ అగ్ర నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ సైన్యం దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ ప్రభుత్వం దెయ్యంగా (డాయన్) మారింది. దెయ్యం తన పిల్లలనే తింటుంది. ఈ రాష్ట్రం ఇప్పుడు తన పిల్లలను, ప్రజలను చంపడానికి సిద్ధంగా ఉంది." అని అన్నారు. షౌకత్ నవాజ్ మీర్ ప్రశ్నిస్తూ, "షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అణచివేతదారుగా ఆరోపిస్తుంది, కానీ ముస్లింలై ఉండి మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు. మీరు ఆజాద్ కాశ్మీర్ అని చెప్పుకుంటున్నది నిజానికి ఆజాద్ కాదు. ప్రజలను తమ అభిప్రాయాలను చెప్పనివ్వకుండా ఆంక్షలు విధించి, మీరు స్వాతంత్ర్య డ్రామా ఆడుతున్నారు." అని ఆరోపించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications