‘‘ఉత్తరకొరియా ఈ రాత్రికే దాడి చేయొచ్చు.. అప్రమత్తంగా ఉండండి’’

ఉత్తరకొరియా ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడగలదని అమెరికా సైన్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే తమ దళాలపై ఈ రాత్రికే దాడి మొదలుపెట్టేందుకు కూడా ఉత్తరకొరియా వెనుకాడబోదని వారు స్పష్టం చేశారు.

వాషింగ్టన్: ఉత్తరకొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణకొరియాతో కలిసి అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆ విన్యాసాలే మూడు దేశాల మధ్య నిప్పును రాజేశాయి.

అయితే సైనిక విన్యాసాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కొంతమంది సైనికాధికారుల సమావేశం బుధవారం జరిగిందని అమెరికా మీడియా చెబుతోంది. ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు దిగితే తిప్పికొట్టాలని ఆ సమావేశంలో అధికారులు తీర్మానించారని తెలిపింది.

vincent brooks-kim

ఉత్తరకొరియా ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడగలదని అమెరికా సైన్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే తమ దళాలపై ఈ రాత్రికే దాడి మొదలుపెట్టేందుకు కూడా ఉత్తరకొరియా వెనుకాడబోదని అమెరికా సైన్యం స్పష్టం చేసింది.

అదే జరిగితే ఉత్తరకొరియాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సైనికులంతా సిద్ధంగా ఉన్నారని జనరల్ విన్సెంట్ బ్రూక్స్ చెప్పారు. అటు ఉత్తరకొరియా కూడా తన పన్నాగల్లో తాను నిమగ్నమై ఉందని అమెరికా మీడియా చెబుతోంది.

మరోవైపు అమెరికా సైనిక దళాలు ఏ మాత్రం హద్దు మీరినా.. వారికి బుద్ధి చెప్పేందుకు తాము కూడా వెనుకాడబోమని ఉత్తరకొరియా సైనికాధికారి జనరల్ బాల్బినా హవాంగ్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+