వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది .. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్.. 111కి పైగా దేశాల్లో డెల్టావేరియంట్ వ్యాప్తి !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోమారు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం ప్రపంచాన్ని హెచ్చరించారు.దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు కరోనా మూడవ వేవ్ యొక్క ప్రారంభ దశలో ఉన్నాము, అప్రమత్తంగా ఉండకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Recommended Video

Corona virus third wave myth Buster | Oneindia Telugu
డెల్టా వేరియంట్ తో డేంజర్ .. తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

డెల్టా వేరియంట్ తో డేంజర్ .. తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ డెల్టా వేరియంట్ యొక్క వ్యాప్తి, ప్రజలలో ఇంకా కరోనాపై పెరగని సామాజిక చైతన్యం, ప్రజారోగ్య రక్షణ చర్యలపై నిర్దిష్టమైన విధానాలు లేకపోవడం , వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగడం వంటి ఇబ్బందులు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రెండిటి పెరుగుదలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు .
టెడ్రోస్ మాట్లాడుతూ, వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉంది, దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చేయగల చేయగల వైవిధ్యాలు పుట్టుకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .

111 కి పైగా దేశాలలో డెల్టా వేరియంట్ వ్యాప్తి

111 కి పైగా దేశాలలో డెల్టా వేరియంట్ వ్యాప్తి

డెల్టా వేరియంట్ ఇప్పుడు 111 కి పైగా దేశాలలో వ్యాప్తి చెందిందని వెల్లడించారు. ఇప్పటివరకు 178 దేశాలలో ఆల్ఫా రకం 123 శాలలో బీటా రకం 75 దేశాలలో గా మారకం కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ఆధిపత్య వేరియంట్ గా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నాలుగవ వారంగా గత వారం గుర్తించబడింది. 10 వారాల స్థిరమైన క్షీణత తరువాత మరణాలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి.

వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన


ప్రపంచ వ్యాక్సిన్ల పంపిణీలో కొనసాగుతున్న దిగ్భ్రాంతికరమైన అసమానత కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మందికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు అందింది . వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయని సంపన్న దేశాలు ఎక్కువ టీకాలను పొందాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే చెబుతోందని ఆయన గుర్తు చేశారు.

 కరోనా ముప్పు ముంగిట ప్రపంచం .. అలెర్ట్ అంటున్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్

కరోనా ముప్పు ముంగిట ప్రపంచం .. అలెర్ట్ అంటున్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్

వ్యాక్సినేషన్ అసమానతల కారణంగా ప్రపంచానికి కరోనా ముప్పు తప్పేలా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ జరగని దేశాల్లో కరోనా వ్యాప్తి చెందినా అది మళ్ళీ అన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ ప్రారంభదశలో ఉన్నామని గుర్తు చేస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని వార్నింగ్ ఇచ్చారు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్.

English summary
World Health Organisation (WHO) chief Tedros Adhanom Ghebreyesus on Thursday warned the world about the 'early stages' of COVID-19 third wave amid Delta surge."Unfortunately...we are now in the early stages of a third wave", he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X