జిన్‌పింగ్‌తో కేక్ తింటూ.. సిరియాపై దాడి చేయమన్నా: ట్రంప్ షాకింగ్
సిరియాపై జరిగిన క్షిపణి దాడిపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాము కేవలం 59 మిసైల్స్ మాత్రమే ప్రయోగించామని ట్రంప్ చెప్పారు.
వాషింగ్టన్: సిరియాపై జరిగిన క్షిపణి దాడిపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాము కేవలం 59 మిసైల్స్ మాత్రమే ప్రయోగించామని ట్రంప్ చెప్పారు.
అంతేకాదు, చైనా అధ్యక్షులు జిన్ పింగ్‌తో కలిసి విందు చేస్తున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.

జిన్‌పింగ్‌తో డిన్నర్ చేసి, కేక్ తిని..
తాను సిరియాపై క్షిపణి దాడుల నిర్ణయం తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు తాను, జిన్‌పింగ్ డిన్నర్ ముగించామని, ఆ తర్వాత చాకొలెట్ కేక్ తిన్నామని, జిన్‌పింగ్‌కి అది చాలా నచ్చిందని, అప్పుడే తనకు అధికారుల నుంచి షిప్‌లన్నీ లాక్ చేసి లోడ్ నింపామని ఇప్పుడేం చేయమంటారని మెసేజ్ వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.

59 క్షిపణిలు ప్రయోగించాం
ఇక దాడులు నిర్వహించండని తాను ఆదేశించానని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత జిన్‌పింగ్‌కి ఈ విషయం చెబుతూ.. ఇప్పుడే మేం సిరియాలో 59 క్షిపణులతో దాడులు జరిపామని చెప్పానని, బహుశా తాను చెప్పింది జిన్‌పింగ్‌కి అర్థం కాలేదనుకుంటానని పేర్కొన్నారు.దాంతో ఆయన పక్కనే ఉన్న అధికారిని ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగారని ట్రంప్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.ఆ తర్వాత జిన్‌పింగ్‌కి తాను చెప్పింది అర్థమైందని పేర్కొన్నారు.

జిన్‌పింగ్ పాజిటివ్‌గా..
దాడుల గురించి జిన్‌పింగ్ పాజిటీవ్‌గా స్పందిస్తూ.. పిల్లలను గ్యాస్ దాడులతో చంపేసిన వారిపై ఇలాంటి దాడులు జరపడంలో తప్పులేదని చెప్పారని ట్రంప్ తెలిపారు.

సిరియా చర్యకు ధీటుగా..
కాగా, ట్రంప్ నిర్ణయంపై ఆయన కుమార్తె ఇవాంకా ప్రభావంకూడా ఉందని ఇటీవల ట్రంప్ కుమారుడు ఎరిక్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.సిరియాలో ఇటీవల రసాయన దాడులు జరిగి 100 మందికి పైగా బలైన విషయం తెలిసిందే. అయితే దాడులు చేసింది ఆ దేశ ప్రభుత్వమే అని అమెరికా సహా చాలా దేశాలు ఆరోపిస్తున్నాయి. సిరియా చర్యకు దీటుగా జవాబు చెప్పేందుకు గతవారం అమెరికా ఆ దేశంపై క్షిపణి దాడులు చేపట్టింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications