పెళ్లి పార్టీలో గ్యాంగ్ వార్: 21 మంది అంతం

కాబూల్: పెళ్లి జరిగిన ఇంటికి విందుకు వెళ్లిన 21 మంది బంధువులు తుపాకి తూటాలకు బలి అయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. కాబూల్ నగరం సమీపంలోని ఒక గ్రామంలో ఒక పెళ్లింట ఈ దారుణ సంఘటన జరిగింది.

కాబూల్ నగరం సమీపంలోని దెహస్లా గ్రామంలో ఆదివారం పెళ్లి జరిగింది. పెళ్లికి బంధువులు వెళ్లారు. పెళ్లి జరిగిన తరువాత ఎర్పాటు చేసిన విందులో చిన్న గొడవ జరిగింది. ఆ సందర్బంలో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి విషమించింది.

Wedding gunfight,21 people killed in Afghanistan

అంతే రెండు వర్గాల వారు పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు. ఈ దాడులలో 14 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న 21 మంది సంఘటనా స్థలంలో మరణించారని సీనియర్ పోలీసు అధికారి గులిస్థాన్ క్వుసాని చెప్పారు.

ఈ దాడిలో 10 మంది గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. చాల సంవత్సరాల నుండి రెండు వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయని, పెళ్లి విందులో పగ తీర్చుకోవడానికి ప్రయత్నించి పరస్పరం కాల్పులు జరుపుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+