వెల్లువెత్తిన మేసేజ్‌లు: 2 గంటలపాటు నిలిచిన వాట్సాప్ సేవలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: నూతన సంవత్సర వేడుకల శుభాకాంక్షల సందర్భంగా వేలాది మేసేజ్‌లు ఒకేసారి వెల్లువెత్తడంతో వాట్సాప్ యాప్ రెండు గంటల పాటు క్రాష్‌డౌన్ అయింది. అయితే ఈ అసౌకర్యానికి వాట్సాప్ ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం వాట్సాప్ యధావిధిగా పనిచేస్తోంది.

ప్రఖ్యాత మెసేజింగ్‌ సర్వీస్‌ యాప్‌ వాట్సప్‌ క్రాష్‌డౌన్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలం రేగింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని వేలాది మేసేజ్ లు ఒకేసారి రావడంతో వాట్సాప్ క్రాష్ డౌన్ అయింది. సోమవారం తెల్లవారుజామున 12 .05 నుండి 2 గంటల వరకు వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

WhatsApp crashes as millions try to send New Year’s messages

ఊహకు అందని రీతిలో న్యూఇయర్‌ విషెస్‌ వెల్లువత్తడంతో ఏర్పడిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే ఒకేసారి వాట్సాప్ ద్వారా వేలాది మేసేజ్‌లు వెల్లువెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాట్సాప్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ యూజర్లకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు చెబుతూ వాట్సప్‌ ప్రతినిధులు ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వాట్సప్‌ యధావిధిగా పనిచేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేవని వాట్సాప్ ప్రతినిధులు ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
WhatsApp users across the country were unable to send New Year's messages to their friends and family after the messaging app crashed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి