భారత్, పాకిస్థాన్ కు ట్రంప్ సీరియస్ వార్నింగ్?
పాకిస్థాన్ వరుసగా మూడో రోజూ డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్ము కాశ్మీర్, పంజాబ్ లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే వాటిని భారత సైన్యం తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారత్, పాకిస్థాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. వీలైనంత త్వరగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని శ్వేతసౌధం సూచనలు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది.
యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో ఇప్పటికే భారత్- పాకిస్థాన్ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచనలు చేశారు. ఇదే విషయాన్ని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ధృవీకరించారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా యత్నిస్తోందని అన్నారు. ఇరు దేశాల మధ్య మధ్వవర్తిత్వం కుదుర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాధినేతలూ ట్రంప్ కు మంచి మిత్రులే. ఇరు దేశాలతోనూ అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి.. అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.

మరోవైపు పాకిస్థాన్ వరుసగా మూడో రోజూ డ్రోన్ దాడులు చేపట్టింది. జమ్మూ, శ్రీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో భారీగా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తన నివాసంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Washington, DC | On US efforts to mediate in the India-Pakistan conflict, White House Press Secretary Karoline Leavitt says, "This is something that the Secretary of State and now our NSA as well, Marco Rubio, has been involved in. The President has expressed that he… pic.twitter.com/NL55jSFyIM
— ANI (@ANI) May 9, 2025
ఇక పాకిస్థాన్ మాత్రం వరుసగా డ్రోన్ దాడులకు తెగబడుతోంది. శ్రీనగర్ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడికి పాకిస్థాన్ పాల్పడింది. అయితే పాక్ డ్రోన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టినట్లు పేర్కొంది. పంజాబ్ లోని ఫిరోజ్ పురాలోని జనావాసాలపై పాక్ డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇక జమ్ము డివిజన్ ఉధంపుర్ లో పూర్తిగా బ్లాక్ అవుట్ విధించారు. పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ లోనూ బ్లాక్ అవుట్ విధించారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. వీధుల్లోకి రావొద్దని సూచించారు.












Click it and Unblock the Notifications