కోవిడ్ కొత్త వేరియంట్ XE-ఒమిక్రాన్ కంటే 10 రెట్ల వేగంతో వ్యాప్తి-WHO హెచ్చరిక
కోవిడ్ 19 వైరస్ మరో రకం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. తాజా రకాన్ని ఎక్స్ఈగా గుర్తించారు. దీని వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్యసంస్ధ ప్రపంచ దేశాలకు తాజాగా హెచ్చరికలు చేసింది. దీని వ్యాప్తి, ఇతర అంశాలకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకుంది. దీంతో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం, ఓమిక్రాన్ BA2 సబ్-వేరియంట్ కంటే XE అని పిలిచే కొత్త కరోనావైరస్ పది శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని తేలింది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ BA2 ఉపరకం కోవిడ్19 అత్యంత తీవ్ర అంటువ్యాధిగా గుర్తించారు. BA2 ఉపరకం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో విస్తరిస్తోంది. ఇప్పుడు యూఎస్ లో ఎక్కువ సంఖ్యలో కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.

కొత్త రకం XE, ఓమిక్రాన్ రెండు రకాల ఉత్పరివర్తన హైబ్రిడ్ రకంగా గుర్తించారు. అంటే BA1, BA2 రెండింటి హైబ్రిడ్ రకం అన్నమాట. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులలో చూస్తే తక్కువే. జనవరి 19న యూకేలో తొలిసారిగా గుర్తించిన 600 కేసులు నిర్ధారణ అయినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్ధ వారాంతపు నివేదికలో తెలిపింది.
XE రకంలో తీవ్రత, వ్యాప్తి సహా లక్షణాలలో ముఖ్యమైన వ్యత్యాసాలు గుర్తించేవరకు గత ఓమిక్రాన్ రకంలో భాగంగానే దీన్ని కూడా వర్గీకరించనున్నారు. అయితే ఇప్పటికే బయటపడిన వైరస్ లు పరివర్తన చెంది మరికొన్ని కొత్త రకాలుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications