Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మానవాళికి పెనుముప్పు: అంటార్కిటికాలో కరుగుతున్న ఐస్

మానవ తప్పిదాలు, పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. భూమి మీద మూడొంతులు సముద్రం, ఒక వంతు నేల ఉందని అందరికీ తెలిసిన సంగతే.

న్యూయార్క్: మానవ తప్పిదాలు, పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. భూమి మీద మూడొంతులు సముద్రం, ఒక వంతు నేల ఉందని అందరికీ తెలిసిన సంగతే. కానీ ఈ భూమి మీద 50 లక్షల క్యూబిక్‌ మైళ్ల విస్తీర్ణంలో మంచు పేరుకుపోయి ఉందనే విషయం ఎక్కువ మందికి తెలియదు. సాధారణంగా ఇది కరగటానికి 5,000 ఏళ్ల కంటే ఎక్కువ సమయమే పడుతుంది.

కానీ ఇష్టానుసారంగా సహజ వనరులను కొల్లగొట్టటంతోపాటు కాలుష్యం, వేడి పెరిగిపోయి మంచు వేగంగా కరిగిపోతోంది. ఈ పరిస్థితులే కొనసాగితే సముద్ర తీర ప్రాంత నగరాలన్నీ సముద్రం పాలుకాక తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటార్కిటికా ద్వీపకల్పం నుంచి ఇటీవల ఒక అతిపెద్ద మంచు పలక విరిగిపడి అంటార్కిటికా- దక్షిణ అమెరికాలను వేరుచేసే వెడెల్‌ సముద్రంలో పడిపోయింది. ఇదేదో చిన్న మంచు కొండ కాదు.

అమెరికాలోని డెలవేర్‌ రాష్ట్రానికి సమానమైన పరిమాణంలో ఉంది. దీని బరువు 1.1 ట్రిలియన్‌ టన్నులు. పరిధి దాదాపు 2,200 చదరపు మైళ్లు. అమెరికన్లు ఒక ఏడాదిలో వినియోగించే నీటికి రెట్టింపు నీరు ఇందులో ఉంది. ఇంత పెద్ద మంచుపలక విరిగిపడటం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది నెమ్మదిగా దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రం వైపు కదులుతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా నీటిలో కరిగిపోవటానికి ఎంతోకాలం పడుతుంది.

ఈ లోగా సముద్రంలో నౌకలు దీన్ని ఢీకొని ప్రమాదాలకు గురి కావచ్చు. అంతకంటే పర్యావరణానికి కలిగే నష్టం అపారం. ఈ మంచు పలక పూర్తిగా కరిగితే సముద్ర నీటిమట్టం మూడు మిల్లీమీటర్లు పెరుగుతుంది. భూవాతావరణం వేడెక్కి మంచుకరిగి సముద్రాలు ఉప్పొంగుతాయని శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తున్నారు. అటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందనటానికి ఇదొక తాజా ఉదాహరణ.

కోస్తా నగరాలు నీటిలోనే

కోస్తా నగరాలు నీటిలోనే

కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం భూతాపం తగ్గించటానికి ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన ‘పారిస్‌ ఒప్పందం' నుంచి ఎటువంటి సంకోచం లేకుండా బయటకు వచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధపడ్డారు. కానీ భూతాపం పెరిగిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆ దేశమే? ఆర్కిటిక్‌ ధ్రువప్రాంతంలో మంచు కరగటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాలో ఇప్పటికే ఆందోళన ఉంది.

ఇప్పుడు అంటార్కిటికా నుంచి కూడా అమెరికాకు ముప్పు ఎదురుకానున్నది. ఆ దేశానికి ఒకపక్క పసిఫిక్‌ మహాసముద్రం, మరోపక్క అట్లాంటిక్‌ మహాసముద్రం ఉన్నాయి. అమెరికాలోని ప్రధాన నగరాలు, వృద్ధి కేంద్రాలు అన్నీ సముద్ర తీరంలోనే ఉండటం గమనార్హం. సముద్ర నీటిమట్టం నాలుగైదు అడుగులు పెరిగితే ఆ నగరాలు నీట మునిగిపోతాయి. సాధ్యమైన అధికంగా కర్బన ఉద్గారాలను తగ్గించని పక్షంలో వందేళ్ల లోపే మంచు అధికంగా కరిగి ఉపద్రవం ముంచుకొస్తుంది. భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతే సముద్ర నీటిమట్టం ఇప్పుడున్న స్థాయి నుంచి 216 అడుగులు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అమెరికాలోని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పియర్‌ ఏజెన్సీ కొద్దికాలం క్రితం విడుదల చేసిన నివేదిక ప్రకారం సముద్ర నీటి మట్టం పెరిగిన ఫలితంగా 2100 నాటికి అమెరికాలోని పలు నగరాలు నీటిలో మునిగిపోతాయి. అట్లాంటిక్‌ సిటీ, న్యూఓర్లాన్స్‌, న్యూజెర్సీ, టెక్సాస్‌, హవానా, మియామి నగరాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సి వస్తుంది. దక్షిణ అమెరికాలోని బ్యూనస్‌ఏరిస్‌ నగరం నీటి పాలవుతుంది.

పరాగ్వే, ఉరుగ్వే దేశాలను సముద్రం విడదీస్తుంది. గల్ఫ్‌తీర ప్రాంతాన్ని సముద్రం ముంచెత్తుతుంది. భారతదేశంలోని కోల్‌కతా, ముంబై నగరాలు సముద్రంలో మునిగిపోయే ముప్పు ఉంది. ప్రస్తుత బంగ్లాదేశ్‌ భూభాగం చాలామేరకు సముద్రం పాలవుతుంది. చైనా తూర్పు తీరంలోని నగరాలు తూర్పు చైనా సముద్రంలో కలిసిపోతాయి. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి.

ఆర్కిటిక్‌ బాటలోనే అంటార్కిటికా?

ఆర్కిటిక్‌ బాటలోనే అంటార్కిటికా?

శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఈ శతాబ్దాంతానికి వాతావరణ మార్పుల వల్ల సముద్రం ఉప్పొంగితే తీవ్రమైన కరవు, వరదలు నిత్యకృత్యమవుతాయి. అధిక వేడి, నీరు కలుషితం కావటంతో ప్రస్తుత నివాస ప్రాంతాల్లో తీవ్ర జననష్టం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురవుతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూతాపం వల్ల సముద్రం ఏటా 3 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతోంది. ఈ మార్పుల ఫలితంగా భూమి మీద కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి.

గనుల తవ్వకం, చమురు కోసం అన్వేషణ, కర్బన ఉద్గారాలు వెదజల్లటం... వంటి పర్యావరణ వ్యతిరేక చర్యల ప్రభావంతో ఉత్తర ధ్రువప్రాంతమైన ఆర్కిటిక్‌ వలయంలో మంచు వేగంగా కరిగిపోతోంది. మంచు కొండలు కరిగిపోవటం, విరిగిపోయి సముద్రంలో పడిపోవటం అధికంగా జరుగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో నివసించే ధ్రువ ఎలుగుబంటి, సముద్ర పక్షులు, ఇంకెన్నో జాతుల పక్షులు, ఇతర జంతుజాలం హరించుకుపోతోంది.

వచ్చే వందేళ్లలో ఆర్కిటిక్‌ ప్రాంతంలో ప్రాణికోటి ఉనికే ఉండదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇటువంటి ముప్పు దక్షిణ ధ్రువప్రాంతమైన అంటార్కిటికా ద్వీపకల్పానికి లేదని భావిస్తూ వచ్చారు. కానీ అక్కడ తాజాగా అతిపెద్ద మంచుపలక విరిగిపడిపోవటంతో శాస్త్రవేత్తల్లో అనుమానాలు మొదలయ్యాయి.

అంటార్కిటికాలోనే మంచు రూపంలో 60 % నీరు

అంటార్కిటికాలోనే మంచు రూపంలో 60 % నీరు

భూమిపై ఉన్న స్వచ్ఛ జలాల్లో ఒక్క అంటార్కిటికాలోనే 60శాతం మంచు గడ్డల రూపంలో ఉంది. అయితే, ఈ మంచు ఫలకలు వేగంగా కరిగిపోతున్నాయి. ప్రత్యేకించి పశ్చిమ అంటార్కిటికా హిమానీనదాలు సముద్ర మట్టానికి దిగువున్న ఉన్న నేపథ్యంలో సముద్ర వేడికి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఏటా వందల కోట్ల టన్నుల మంచుగడ్డలు కరిగిపోయి.. సముద్రంలో కలిసిపోతున్నాయని అంచనా.

మంచు ఫలకలు పగిలిపోయి, కరిగిపోయి సముద్రంలో కలిసిపోతే తీర ప్రాంతాల్లోని నగరాలు కనీవినీ ఎరుగని బీభత్స పరిస్థితిని ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కోట్ల మంది ప్రజలు సముద్ర తీరాన్ని వదిలి.. ప్రధానభూభాగంలోకి వలసలు వెళ్లాల్సి ఉంటుందంటున్నారు. సినిమాల్లో, కాల్పనిక కథల్లో కనిపించే ఈ దృశ్యాలు, వర్ణనలు వాస్తవ రూపు తీసుకోవడానికి ఎంతో కాలం పట్టదని స్పష్టంచేస్తున్నారు.

భూతాపం, సముద్ర జలాలు వేడెక్కుతుండటంతో పర్యావరణంగా ప్రమాదకర పరిణామాలు చేటు చేసుకుంటున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గత 50 ఏండ్లుగా ఈ ప్రాంతంలో జీవావరణం క్రమంగా పెరుగుతూ వస్తున్నదని గుర్తించారు. అంటార్కిటికాలో దాదాపు 644 కిలోమీటర్ల ప్రాంతంలోని చల్లదనంపై అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల బృందం అక్కడికి వెళ్లి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

అర్ధశతాబ్దంగా అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దాని ఫలితంగా ఈ ప్రాంతంలో పచ్చదనం పెరుగుతున్నదని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కు చెందిన శాస్త్రవేత్త మాట్ అమెస్‌బురీ చెప్పారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే హిమానీనదాలు తగ్గిపోతాయని, ఫలితంగా భవిష్యత్‌లో మరింత పచ్చదనం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.

మంచు కరిగితే 160 అడుగుల ఎత్తున నీరు

మంచు కరిగితే 160 అడుగుల ఎత్తున నీరు

అంటార్కిటికాలో మారుతున్న పరిస్థితులతో సముద్ర జలాల మట్టం ఈ శతాబ్ది చివరికల్లా మూడు అడుగుల మేర పెరుగుతుందని నాలుగేండ్ల క్రితం అంతర్జాతీయ పర్యావరణ ప్యానెల్ అంచనా వేసింది. అది మూడు అడుగులు కాదని, దానికి రెట్టింపు స్థాయిలో ఆరు అడుగుల మేర సముద్ర నీటి మట్టం పెరుగుతుందని తాజా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు అమెరికా, బ్రిటన్ చర్యలు చేపట్టాయి. అయితే దీనికి రెండున్నర కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని అంచనా.

అంతేకాక ఈ చర్యలకు ఫలితాలు రావడానికి కొన్నేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. మంచుగడ్డలు కరుగకుండా నిరోధిస్తున్న రాస్ ఐస్ షెల్ఫ్‌పై కొలంబియా శాస్త్రవేత్తలు రెండు అంటార్కిటికా వేసవికాలాల్లో పరిశోధన జరిపారు. ఇది రానున్న కొద్ది దశాబ్దాల్లో కుప్పకూలిపోతుందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి. అంటార్కిటికాలో కోట్ల సంవత్సరాల నుంచి మంచుగడ్డలు పేరుకున్నాయి.

అక్కడ కురిసే మంచు పలుచటి పొరలుగా మారి.. క్రమంగా భారీ మంచుగడ్డలుగా రూపొంది, కొండలు, పర్వతాలను కప్పేస్తాయి. అక్కడ మంచు పొర దాదాపు మూడు కిలోమీటర్లకుపైగా మందంతో ఉంటుంది. ఇది మొత్తం కరిగిపోతే మొత్తం భూమిపై 160 అడుగుల ఎత్తున నీరు అవరిస్తుంది. భూగర్భంలో లభించే శిలాజ ఇంధన వనరులు మొత్తాన్నీ ఉపయోగిస్తే వచ్చే వేడి, కాలుష్యంతో ఈ మంచు పలకలు కరిగిపోవడం ఖాయం. వాస్తవానికి 25వేల ఏళ్ల క్రితం నుంచే హిమానీనదాలు కరుగుతుండటం స్వాభావిక ప్రక్రియ. ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం దీనికి భిన్నమైన విధ్వంసమని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+