వామ్మో.. ఇదేమి చిత్రం.. గర్భం దాల్చిన కొద్దీరోజులకే మరోసారి ప్రెగ్నెన్సీ.. కవలల జననం

కాలం ప్రభావమో.. ఏమో కానీ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గర్భం దాల్చిన కొద్దీ రోజులకు మరోసారి గర్భం దాల్చింది వివాహిత. వినడానికి వింతగా ఉన్న ఇదీ మాత్రం నిజం. బ్రిటన్ మహిళ రెబెకా రాబర్ట్స్ ఉదంతం ఇటీవల వైరల్‌గా మారింది. వైద్య పరిభాషలో దీన్ని సుపర్ ఫిటేషన్ అని పిలుస్తారు. పిండం గర్భాశయంలో స్థిరపడ్డ తరువాత కూడా మహిళ మళ్లీ గర్భం దాలుస్తుంది.

 woman gives birth to nonidentical twin

కేవలం 0.3 శాతం సందర్భాల్లో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రెండో పిండం బతికే అవకాశాలు చాలా తక్కువని పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ రెబెకా రాబర్ట్స్ విషయంలో ఇద్దరు బిడ్డలు జీవించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆమె ప్రసవించింది. మగబిడ్డ నోవా ఆరోగ్యంగా ఉండగా.. రెండో బిడ్డ రోసలీ తక్కువ బరువుతో పుట్టాడు. వైద్యులు రోసలీని 95 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచారు. కొద్ది వారాల క్రితమే డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

కానీ ఇదీ మాత్రం విచిత్రమే.. ఎందుకంటే రెండుసార్లు గర్భం దాల్చడం అంటే మామూలు విషయం కాదు. అలా దాల్చి ఇద్దరు బతకడం మరో గొప్ప విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+