వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్ మీటింగ్.. కుర్చీ విరిగిపోయి, కిందపడిపోయి.. ఇదీ పరిస్థితి తత

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల అంతా ఆన్‌లైనే.. పిల్లల చదువులు, పెద్దల ఆఫీసులు. విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇక పెద్దలు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొలీగ్స్‌తో వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించాల్సి వస్తోంది. ఇదీ కామనే.. కార్యాలయాలు తెరిచి ఉంటే.. మీటింగ్ రూములో చర్చించేవారు. ఇప్పుడు లేనందున.. వర్చువల్ మీటింగ్ తప్ప గత్యంతరం లేదు.

అమెరికా కాలిఫోర్నియాకు చెందిన చార్లెట్‌ కొజినెట్‌ ఉద్యోగి కూడా అలా పాల్గొన్నారు. మూడు రోజుల క్రితం తమ సీఈఓ నిర్వహించిన ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. కొలిగ్స్ సీరియస్‌గా చర్చిస్తున్న సమయంలో చార్లెట్‌ కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. ఆమె ఢమాలున కిందపడిపోయింది. వెంటనే తేరుకున్న ఆమె.. లైవ్‌ విషయం గుర్తుకొచ్చి.. ఇదంతా రికార్డు అయ్యిందా ఏంటి అంటూ సరదాగా కొలిగ్స్‌ను అడుగుతూ గంభీర వాతావరణాన్ని తేలిక చేసేందుకు ప్రయత్నించారు.

Womans Chair Breaks During Office Video Call With CEO

చార్లెట్‌కు దెబ్బలేమీ తగలలేదని తెలిసి.. చిరునవ్వులు చిందిస్తూ జాగ్రత్తగా ఉండాలని కొలిగ్స్ సూచించారు. లైవ్‌ రికార్డింగ్‌ ఆపేసి... మరో కుర్చీ తెచ్చుకుని భేటీని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చార్లెట్‌ షేర్‌ చేశారు. ఈవోతో కాల్‌లో ఉన్న సమయంలో కుర్చీ ఇలా విరిగిపోయింది.. చూసి ఎంజాయ్‌ చేయండి అంటూ సరదా క్యాప్షన్‌ జతచేశారు. వాళ్లు చెల్లించే జీతం సరిపోవడం లేదని నిరసన తెలియజేశావా? ఏదేమైనా ఫన్నీ వీడియో షేర్‌ చేసినందుకు థాంక్స్‌ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి చార్లెట్ ఇలా ఫేమస్ అయ్యారు.

English summary
woman was busy interacting with her colleagues including the CEO of the company when suddenly her chair broke and she fell flat on the ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X