ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూత
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూశారు. ఇటీవలే 117వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె గుండే పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కిన మిసావో ఒకావో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె గత పదిరోజులుగా ఆకలి మరచిపోయిందని, కనీసం ద్రవ పదార్ధాలు కూడా తీసుకోలేదని ఆమె మనవడు తెలిపారు.

గత నెలలో ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆమె ఆ తర్వాత తమను విడిచి వెళ్లడం బాధాకరమని అన్నారు. యూకియో అనే వ్యక్తిని 1919లో పెళ్లాడిన ఒకావాకు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.
భర్త యూకియో 1931లో చనిపోయాడు. ఆమెకు మనవళ్లు, మునిమనవళ్లు కూడా ఉన్నారు. మాసావో 1898 మార్చి 5న జన్మించారు. 2013లో గిన్నిస్ సంస్థ ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తించింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications