'నన్ను ఫస్ట్ టైం రేప్ చేసినప్పుడు బాధ మర్చిపోయా'
లండన్: సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులకు పట్టుబడి వారందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న నాదియా అంటోంది. కొద్ది నెలల క్రితం తాను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదని, సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులకు పట్టుబడి తన వారందరినీ కళ్లముందే కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
సెక్స్ స్లేవ్‌గా తాను నలిగిపోయానని, చావుకు తెగించి మరీ తప్పించుకొని వచ్చానని చెప్పింది. తన కథను ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ హౌస్ ప్రతినిధులకు ఆమె వివరించింది. తన కథ బాధాకరమేనని, ఐసిస్ బందీల్లో ఇంకా నలుగుతున్న ఎందరి వద్దనో మరింత బాధాకరమైన గాథలు ఉన్నాయని చెప్పింది.

ప్రస్తుతం దాదాపు ఆరువేల మంది వరకు యాజిది మహిళలు, ఆడపిల్లలు ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పింది. కొన్ని కుటుంబాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, తనను మౌసుల్‌కుతీసుకు వెళ్లి తొలిసారి అత్యాచారం చేశారని, ఆ క్షణాన తన తల్లి, సోదరులు మరణించారనే బాధ మాయమైందని చెప్పింది.
అంతకుమించిన లేదని చెప్పింది. నగరంలో వందమందికి పైగా మహిళల మృతదేహాలు ఒకేచోట పడేసి చాలా చోట్ల ఉన్నాయని చెప్పింది. తాను మూడు నెలల పాటు వారి వద్ద నరకం అనుభవించానని చెప్పింది. కాగా, ఐసిస్ ఘాతుకాలు ఎన్నో వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications