Year Ender 2020 : అంగారకుడిపై మూడు నీటి సరస్సులు.. ఈ ఏడాది పరిశోధనల్లో వెలుగులోకి...
ఖగోళం ఎప్పటికీ ఒక మిస్టరీ... విశ్వంతరాళం ఎన్నటికీ చిక్కని ఓ రహస్యం... ఏటా ఎన్నో పరిశోధనలు... ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అంతులేని విశ్వాంతరాళాన్ని శోధించడం అంత సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు అనంత విశ్వపు పుట్టుకను,అంతరిక్ష రహస్యాలను కనుగొనేందుకు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో 2020లోనూ ఖగోళ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Recommended Video

మూడు ఉప్పు నీటి సరస్సులు...
ఈ ఏడాది నవంబర్‌లో నేచర్ ఆస్ట్రానమీలో ఒక పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది. అందులో అంగారకుడిపై కొత్తగా మరో మూడు ఉప్పు నీటి సరస్సులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. గతంలో గుర్తించిన పెద్ద నీటి సరస్సుకు పక్కనే వీటి జాడలను గుర్తించామన్నారు. ఈ మూడు సరస్సులు అంగారక ఉపరితలం కింద కప్పిపెట్టబడి ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. వీటి విస్తీర్ణం దాదాపు 75వేల చదరపు కిలోమీటర్లు. అంటే జర్మనీ లాంటి దేశంలో ఐదో వంతు పరిమాణం. ఈ మూడింటిలో అతిపెద్దదైన సెంట్రల్ సరస్సు 30కి.మీ మేర విస్తరించింది. దీని చుట్టూ మూడు సరస్సులు కి.మీల కొద్ది వెడల్పుతో విస్తరించి ఉన్నాయి.

4.4బిలియన్ల క్రితం నుంచే నీరు..
ఇదే ఏడాది జరిపిన మరో పరిశోధనలోనూ అంగారక గ్రహంపై నీరు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు,4.4బిలియన్ల సంవత్సరాల క్రితమే అక్కడ నీటి జాడ ఉందని కనుగొన్నారు. జపాన్‌లోని టోక్యో విశ్వ విద్యాలయ పరిశోధకుల బృందం ఈ సరికొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. గతంలోనూ ఎన్నో పరిశోధనలు అంగారకుడిపై నీరు ఉన్నట్లు ధ్రువీకరించినప్పటికీ... కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా అక్కడ నీరు ఉన్నట్లు గుర్తించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

మానవ నివాస యోగ్యమేనా?
మానవ నివాసానికి అనుకూలమైన గ్రహం ఈ విశ్వంలో మరొకటి ఉందా అన్న ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనలు నిరంతరం కొత్త విషయాలను వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలంగా అంగారకుడిపై మానవ నివాస అనుకూలతలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నీటి జాడ ఉందంటే... అక్కడ జీవం ఉంటుందన్నది వాస్తవమని, కాబట్టి అంగారక గ్రహం ఆవాస యోగ్యమే అన్న వాదనకు శాస్త్రవేత్తల పరిశోధనలు బలం చేకూరుస్తూ వస్తున్నాయి.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications