గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన మోదీ యోగా సెషన్‌

వాషింగ్టన్: ఇవ్వాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యోగాసనాలు వేశారు. సూర్య నమస్కారాలు చేశారు. ప్రాణాయామంతో యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి నార్త్ లాన్‌లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. యోగా సెషన్‌ను స్వయంగా ఆయన లీడ్ చేశారు.

కొద్దిసేపటి కిందటే ఆయన నార్త్ లాన్‌కు చేరుకున్నారు. అంతకుముందు- ఐక్యరాజ్య సమితి ఆవరణలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. మౌనం పాటించారు. అనంతరం అక్కడి నుంచి నార్త్ లాన్‌కు చేరుకున్నారు. లాన్‌లో మోదీ అడుగు పెట్టిన వెంటనే అక్కడున్న వారు పెద్ద ఎత్తున ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. మోదీకి జైకొట్టారు.

Yoga session, led by PM Modi at UN headquarters bags Guinness record

ఆ సమయంలో మోదీ వెంట ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు సిసబ కొరొసి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డిజిటల్ ఎవాంజలిస్ట్ వాలా ఆఫ్సర్, అవార్డ్ విన్నింగ్ స్టోరీ టెల్లర్ జై షెట్టి, భారత్‌కు చెందిన ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా, గ్రామీ అవార్డ్ విజేత రికీ కేజ్, ఆఫ్రికన్- అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్.. తదితర ప్రముఖులు ఉన్నారు. వారందరూ ఈ యోగా సెషన్‌లో పాల్గొంటోన్నారు.

ఈ యోగా సెషన్ చరిత్ర సృష్టించింది. గిన్నిస్ బుక్ రికార్డ్‌ను అందుకుంది. అత్యధిక జాతీయులు పాల్గొన్న సెషన్‌గా రికార్డులకెక్కింది. ఈ యోగా సెషన్‌లో వివిధ జాతీయులకు చెందినవారు పాల్గొనడమే దీనికి కారణం. ప్రవాస భారతీయులతో పాటు ఆఫ్రికన్, అమెరికన్, కెనడియన్.. ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, జాతులు, తెగలకు చెందిన వారు యోగాలో పాల్గొన్నారు. ఇదో రికార్డ్.

ఒక కార్యక్రమంలో 135 దేశాల మంది పాల్గొనడం ఇప్పటివరకు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు. యోగా సెషన్ ముగిసిన తరువాత ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మోదీ- చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడాన్నిస్వాగతించారు.

యోగా అనేది ఏ ఒక్క దేశానికో, జాతికో పరిమితం కాలేదనే ఉదంతాన్ని గిన్నిస్ రికార్డ్ అందుకోవడం ద్వారా మరోసారి నిరూపించుకుందని మోదీ వ్యాఖ్యానించారు. సెషన్ ముగిసిన అనంతరం చిన్నారులతో మోదీ మమేకం అయ్యారు. వారితో కలిసి ఫొటోలను దిగారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉల్లాసంగా కనిపించారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+