Youtube: శుభవార్త చెప్పిన యూట్యూబ్.. 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా మానిటైజేషన్ చేసుకోవచ్చు..!
కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ శుభవార్త చెప్పింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. నిబంధనల మార్పు తర్వాత క్రియేటర్లు యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ లో చేరడానికి 500 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. గత 90 రోజుల్లో మూడు పబ్లిక్ అప్‌లోడ్‌లు చేయడంతో పాటు సంవత్సర కాలంలో 3,000 గంటల వాచ్ అవర్స్ ఉండాలి. లేదా చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి.
అంతకు ముందు మానిటైజేషన్ అప్లయ్ చేయాలంటే సంవత్సర కాలంలో 1000 బ్‌స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ అవర్స్ లేదా కోటి షార్ట్స్ వ్యూస్ ఉండాలి. మానిటైజేషన్ చేసుకున్న వారు సూపర్ థాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్‌లు మరియు ఛానెల్ మెంబర్‌షిప్ వంటి ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లకు యాక్సెస్ పొందగలరు. ఈ సృష్టికర్తలు YouTube షాపింగ్‌లో తమ స్వంత ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.

మార్చిన నిబంధనలు మొదటగా అమెరికా, బ్రిటన్, కెనడా, దక్షిణ కొరియా, తైవాన్ లో అమలు చేయనున్నారు. ఇండియాలో ఎప్పటి నుంచి ఈ నిబంధనలు అముల చేస్తారో కంపెన ప్రకటించలేదు. అయితే కొత్త నిబంధనలతో చిన్న కంటెంట్ క్రియేటర్లు లాభం పొందే అవకాశం ఉంది. అయితే YouTube Premium నుంచి రాబడి భాగస్వామ్యాన్ని అన్‌లాక్ చేసుకోవడాని ఎలాంటి మార్పు చేయలేదు. దీన్ని అన్ లాక్ చేసుకోవాలంటే ఇందులో 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. గత సంవత్సరంలో 4,000 వీక్షణ గంటలు లేదా గత 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలి.
ఇండియాలో యూట్యూబ్ పై ఆదాయం పొందేవారు క్రమంగా పెరుగుతున్నారు. దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం వస్తోంది. యూట్యూబ్ తో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. 2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్ సృష్టించింది. 2020లో యూట్యూబ్ ద్వారా భారత జీడీపీకి రూ.6,800 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి ఇద్దరు వినియోగదారులలో ఒకరు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి యూట్యూబ్ ను వాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications