వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ధోనీ అంటే ఎందుకు ఇష్టమో చెప్పిన జోస్ బట్లర్.. అతి పెద్ద ఫ్యాన్‌ అట..!

|
Google Oneindia TeluguNews

దుబాయ్‌: టీమిండి మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశాంతత, విధ్వంసకర బ్యాటింగ్‌తోనే అతనికి డై హార్డ్ ఫ్యాన్ అయ్యానని ఇంగ్లండ్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఇటీవల మహీ జెర్సీని కానుకగా అందుకొని సంబరపడిపోయిన బట్లర్.. ఈ చెన్నై సారథికి అభిమానిగా మారడానికి గల కారణాలను వెల్లడించాడు.

'మైదానంలో ధోనీ ప్రవర్తన అంటే చాలా ఇష్టం. ప్రత్యేకంగా అతని ప్రశాంతత నన్ను విపరీతంగా ఆకట్టుకునేది. అతని విధ్వంసకర బ్యాటింగ్‌ అంటే ఇంకా ఇష్టం. ప్రత్యేకంగా ధోనీ ఆడే హెలికాప్టర్‌ షాట్‌ను ఎక్కువగా ఇష్టపడుతా. నేను ఎప్పుడూ ఐపీఎల్‌ను టీవీలో చూసేవాడిని. ధోనీ చాలా గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ధోనీ మ్యాచ్‌ను ఫినిష్‌ చేసిన విధానమైతే అద్భుతం. ఆ ఫైనల్‌ మ్యాచ్‌ను ఇంటిదగ్గర నుంచే వీక్షించా. ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించడం ఇప్పటీకీ నా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. ఆ సిక్స్‌ ఎప్పుడూ ప‍్రతిధ్వనిస్తూనే ఉంటుంది'అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్లర్‌ చెప్పుకొచ్చాడు.

 IPL 2020: Im a big fan of Dhoni, says Jos Butler

ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన రెండో అంచె మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం సాధించిన తర్వాత జోస్‌ బట్లర్‌కు ధోనీ బహుమతి ఇచ్చాడు. అతని 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌ జెర్సీని కానుకగా అందజేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ధోనీకి ఎంతోమంది అభిమానులు ఉండగా అందులో బట్లర్‌ ఒకడు. ఈ విషయాన్ని ఈ ఇంగ్లండ్ క్రికెటర్ ఇప్పటికే పలుమార్లు తెలియజేశాడు.

ఇక ఐపీఎల్‌లో ప్రైజ్ ట్యాగ్ అనేది ఎప్పుడూ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టేయడంతో పాటు భారీ అంచనాలను నెలకొనెలా చేస్తుందని బట్లర్ అభిప్రాయపడ్డాడు. 'ప్రైజ్ ట్యాగ్‌ కారణంగా అంచనాలు ఎక్కువ అవుతాయి. తద్వారా ఒత్తిడి నెలకొంటుంది. ఈ పరిస్థితి అధిగమించడం మరో నైపుణ్యం. అయితే బెస్ట్ ప్లేయర్స్ దీన్ని పక్కన పెట్టి తమ ఆటపై దృష్టిసారించాలి. ఇక స్టోక్స్, నేను బ్యాటింగ్ చేసేటప్పుడు బంతిపైనే దృష్టిసారిస్తాం. బయటి పరిస్థితులను, అంచనాలను ఏ మాత్రం పట్టించుకోం. ఇక నేను ఒకే విధంగా బ్యాటింగ్ చేయను. పరిస్థితులకు తగ్గట్లు ఆడటానికి ప్రయత్నిస్తాను'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

English summary
IPL 2020: Jos Buttler reveals how he became a big fan of MS Dhoni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X