వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోహ్లీసేన ముఖచిత్రం ఏమిటో: ప్లేఆఫ్ ముంగిట పల్టీ: ఇంకొక్క మ్యాచ్: హైదరాబాద్ సత్తాకు అగ్నిపరీక్ష

|
Google Oneindia TeluguNews

షార్జా: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుంటాయనేది పాత సామెత. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌కు ఇది అతికినట్టు సరిపోతోంది. నో డౌట్. టోర్నమెంట్ ఆరంభంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తూ వచ్చిన మేటి జట్లన్నీ.. ఇప్పుడు వరుస పరాజయాలను చవి చూస్తున్నాయి. ఒక్క మ్యాచ్ గెలిస్తే.. ప్లేఆఫ్‌లో దర్జాగా అడుగు పెట్టే దశలో అనూహ్యంగా ఓటమిపాలవుతున్నాయి. ప్లేఆఫ్ ముంగిట పల్టీలు కొడుతున్నాయి. టోర్నమెంట్ తొలి మ్యాచుల్లో రాణించలేకపోయిన జట్లు.. ఒక్కసారిగా పుంజుకున్నాయి. టేబుల్ టాప్ టీమ్‌లకు ఓటమి రుచిని చూపిస్తున్నాయి.

ఢిల్లీ కేపిటల్స్.. రాయల్ ఛాలెంజర్స్..

ఢిల్లీ కేపిటల్స్.. రాయల్ ఛాలెంజర్స్..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా లీగ్ దశ ముగింపుకొచ్చిన సమయంలో ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు.. ఘోరంగా ఓడిపోతున్నాయి. ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయే దశకు చేరుకున్నాయి. ఒక్క మ్యాచ్ గెలిస్తే.. ప్లేఆఫ్ బెర్త్ కన్‌ఫర్మ్ అయ్యే దశలో ఉన్నాయి ఆ రెండు జట్లు కూడా. ఆ ఒక్క మ్యాచ్ గెలవలేక చేష్టలుడిగిపోతున్నాయి. ఐపీఎల్-2020 మిడ్ సీజన్‌లోనే ఆ రెండు జట్లూ 14 పాయింట్లను సాధించి ప్లేఆఫ్ డోర్ వద్ద నిల్చున్నాయి. ప్లేఆఫ్ చేరాలంటే 16 పాయింట్లు అవసరం. లీగ్ దశ ముగిసిపోతున్నప్పటికీ.. మిగిలిన రెండు పాయింట్ల కోసం అర్రులు చాస్తున్నాయి.

మళ్లీ ఓటమి..

మళ్లీ ఓటమి..

ఢిల్లీ కేపిటల్స్..రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములకు బ్రేక్ పడట్లేదు. శనివారం జరిగిన రెండు మ్యాచుల్లో ఆ రెండూ ప్రత్యర్థుల చేతుల్లో పరాభవం పాలయ్యాయి. ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకు్న్న ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ కేపిటల్స్.. పాయింట్ల పట్టికలో ఎక్కడో ఏడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో నంబర్-2 బెంగళూరు దారుణంగా ఓడిపోయాయి. ఒకేరోజు ఈ రెండు జట్లూ కూడబలుక్కున్నట్లు ఓడిపోయాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ రెండు జట్లు నామమాత్రపు లక్ష్యాన్ని ముందుంచగా.. ప్రత్యర్థులు దాన్ని అవలీలగా కొట్టి అవతల పారేశారు.

86 బంతుల్లో ముంబై.. 85 బంతుల్లో హైదరాబాద్..

86 బంతుల్లో ముంబై.. 85 బంతుల్లో హైదరాబాద్..

కీరన్ పొల్లార్డ్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. 86 బంతుల్లో ఢిల్లీ కేపిటల్స్‌ను మట్టి కరిపించగా.. 85 బంతుల్లో బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది డేవిడ్ వార్నర్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే.. చాలు. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ప్లేఆఫ్‌లో చేరడానికి అవకాశాలను సృష్టించుకుంది. మంగళవారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌ ఢీ కొడుతుంది. ఈ రెండు జట్లకూ అదే చివరి మ్యాచ్.

ముంబైని ఓడించడంలోనే హైదరాబాద్ సత్తా..

ముంబైని ఓడించడంలోనే హైదరాబాద్ సత్తా..

ఇందులో హైదరాబాద్ గెలిస్తే.. 14 పాయింట్లను సాధిస్తుంది. 14 పాయింట్ల వద్దే నిలిచిపోయిన ఇతర జట్లతో పోల్చుకుంటే.. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్‌పై సాధించిన ఘన విజయంతో హైదరాబాద్ జట్టు ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. నాలుగో స్థానానికి చేరుకుంది. 12 పాయింట్లు సాధించిన జట్లన్నింటికంటే మెరుగైన రన్‌రేట్ ఉంది హైదరాబాద్‌కు. మైనస్ నుంచి ప్లస్‌లోకి వచ్చేసింది. 0.555 రన్‌రేట్‌ను నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించగలిగితే.. మెరుగైన రన్‌రేట్ మరింత మెరుగుపడుతుంది. ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది ముంబై టీమ్. పైగా హైదరాబాద్‌తో కంపేర్ చేస్తే.. అన్ని రంగాల్లోనూ బలమైనదే. దాన్ని ఓడించడంలోనే వార్నర్ సేన సత్తా బయటపడుతుంది.

ఢిల్లీ, బెంగళూరు పరిస్థితేంటీ?

ఢిల్లీ, బెంగళూరు పరిస్థితేంటీ?

పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు.. ప్లేఆఫ్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. సోమవారం సాయంత్రం ఈ రెండింటి మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ప్లేఆఫ్‌కు చేరడం పక్కా. ఎందుకంటే.. ఈ రెండింటి ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఏ ఒక్క జట్టు గెలిచినా 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఓడిన జట్టుకు ముందుకు వెళ్లడం అనేది ఆ జట్టు సాధించిన నెట్ రన్‌రేట్ మీద ఆధారపడి ఉంటుంది.

English summary
The equation for the Sunrisers is the simplest: beat Mumbai, and they will be through regardless of other results; lose the match, and they will be out. Big defeats for the Delhi Capitals and the Royal Challengers Bangalore have shaken up the points table again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X