IPL auction 2021: అమ్ముడుపోని తెలుగబ్బాయ్: ఫస్ట్ రౌండ్ అన్ సోల్డ్ లిస్ట్ ఇదే
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట ఆరంభమైంది. తాము ఆరాధించే క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీలు బుట్టలో వేసుకుంటాయోననే ఉత్కంఠత నెలకొంది. మెరికెల్లాంటి కొందరు బ్యాట్స్‌మెన్లు, ఆల్‌రౌండర్ల పేర్లు వేలంపాట లిస్ట్‌లో చేరడం..ఈ మినీ వేలంపాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మినీ వేలం పాట ద్వారా 61 మంది క్రికెటర్లను ఎనిమిది ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఇందులో 22 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. దీనికోసం 196.6 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోన్నాయి. మొత్తం 292 మంది క్రికెటర్లు మినీ ఆక్షన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ ఆక్షన్‌పై మొత్తం 14 మంది తెలుగు క్రికెటర్లు ఆశలు పెట్టుకున్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలిరౌండ్‌లోనే తెలుగు క్రికెటర్లకు షాక్ తగిలింది. టీమిండియా ప్లేయర్ హనుమ విహారిని ఎవరూ తీసుకోలేదు. ఏ ఫ్రాంఛైజీ కూడా అతణ్ని కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం అతను భారత క్రికెట్ జట్టు తరఫున టెస్ట్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ప్రొఫెషనల్ టెస్ట్ ప్లేయర్‌గా అతనికి గుర్తింపు ఉంది. నింపాదిగా బ్యాటింగ్ చే్స్తూ.. సుదీర్ఘ ఇన్నింగ్‌ను ఆడే సత్తా హనుమ విహారికి ఉంది. అదే అతనికి మైనస్ పాయింట్‌గా మారినట్టయింది. ఐపీఎల్ ఫార్మట్‌లో ధనాధన్ బ్యాటింగ్ చేయాల్సి ఉన్నందున.. విహారిని ఏ ఫ్రాంఛైజీ కూడా తీసుకోలేదు.

హనుమ విహారితో పాటు ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, ఆస్ట్రేలియా కేప్టెన్ ఆరోన్ ఫించ్, వెస్టిండీస్ క్రికెటర్ ఎవిన్ లెవిస్, భారత్‌కే చెందిన కరుణ్ నాయర్‌కు ఫ్రాంఛైజీలు షాక్ ఇచ్చాయి. తొలి రౌండ్‌లో వారిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆరోన్ ఫించ్ రాణిస్తోన్నప్పటికీ.. అతని పట్ల ఏ ఫ్రా్ంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదివరకు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఇన్నింగ్‌ను ఆరంభించాడు. ఈ సారి అతణ్ని ఆర్సీబీ వదులుకుంది. ఫలితంగా- మినీ ఆక్షన్ లిస్ట్‌లోకి ఎక్కాడు. మలి విడత రౌండ్‌లల్లో అతన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications