ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సర్కార్ ఉత్తర్వులు..! అక్కడే ఓ ట్విస్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇవాళ జీఓ ఎంఎస్ నంబర్ 17ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి కల్పించే రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదని తెలిపింది. ఎంత ఇవ్వాలో మాత్రం చెప్పలేదు. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఏపీలో స్థానిక ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ల వాడకంపై ఎస్ఈసీ క్లారిటీ..!
ఏపీలో స్థానిక ఎన్నికలు, బ్యాలెట్ పేపర్ల వాడకంపై ఎస్ఈసీ క్లారిటీ..!

బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్‌ రాష్ట్రంలోని బీసీ వర్గాల సామాజిక వెనుకబాటుతనాన్ని అంచనా వేయడంతో పాటు, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సచివాలయాల డేటా, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, వివిధ కమిషన్ల నివేదికలు, ప్రభుత్వ శాఖల రికార్డులు తదితర సమాచారాన్ని పరిశీలించి కమిషన్ తన సిఫార్సులను సమర్పించింది. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి ఆమోదించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

AP Govt Issues Key Orders on BC Reservations in Rural and Urban Local Bodies
ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..! సర్కార్ కు షాక్..!
ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..! సర్కార్ కు షాక్..!

బీసీ రిజర్వేషన్ల అమలులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 'ట్రిపుల్ టెస్ట్' నిబంధనలను పాటించాలని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు జీవోలో పేర్కొంది. బీసీల జనాభాకు సంబంధించిన గణాంకాలు సాధారణ జనగణనలో అందుబాటులో లేని నేపథ్యంలో, ప్రత్యేక కమిషన్ సేకరించిన సమకాలీన సమాచారాన్ని బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రత్యేక కమిషన్ సిఫార్సుల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+