Shocking Video: "కొడతావా కొట్టు" పోలీసులకు ఛాతి చూపించిన యువకుడు..
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో యువతీయువకులు తరలివస్తున్నారు. సీజేపీ నిరసన నేపథ్యంలో పోలీసులు ఇప్పటివరకు 3 వేల మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సీజేపీ అధినేత అభిజిత్ దిప్కే, అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు నిర్బంధించారు. వారు ప్రయాణిస్తున్న విమానం దేశ రాజధాని దిల్లీకి చేరుకోగానే పోలీసులు సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అజ్ఞాతప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని సీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే దిల్లీలో కాక్రోచ్ ల నిరసనలు హోరెత్తుతున్నాయి. జంతర్ మంతర్ వైపు భారీగా యువతీయువకులు దూసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనడానికి బయల్దేరిన యువకులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. మార్గ మధ్యలోనే వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు పోలీసుల వద్దకే వెళ్లి 'కొడతావా కొట్టు' అని ఛాతీ చూపించాడు. అయితే అక్కడున్న పోలీసులు అతడ్ని లాఠీతో కొట్టారు. దాంతో చుట్టుపక్కల ఉన్న యువకులు ఎదురు తిరగడంతో పోలీసులు సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కొట్టండి సార్.. ఎంత కొడతారో కొట్టండి’ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనడానికి బయల్దేరిన యువకులుమార్గమధ్యంలోనే యువకులని అడ్డుకోవడంతో సహా లాఠీఛార్జ్ చేసిన పోలీసులుదీంతో ఓ యువకుడు పోలీసుల వద్దకే వెళ్లి.. ‘కొడతావా కొట్టు’ అని ఛాతీ చూపించిన వైనంఅయినా సిగ్గు లేకుండా.. ఆ యువకుడిని లాఠీతో కొట్టిన ఓ పోలీస్ అధికారిదాంతో చుట్టుపక్కల ఉన్న యువకులు ఎదురుతిరగడంతో సైలెంట్ అయిన పోలీసులుప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 10, 2026
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా దిల్లీలోని మెట్రో స్టేషన్ల మూసివేత ఇవాళ రాత్రి 10 గంటల దాకా కొనసాగుతుందని దిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ తాజాగా వెల్లడించింది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత దీనిపై తదుపరి సమాచారం అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఇక సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీలోని 45 మెట్రో స్టేషన్లు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే మూసివేశారు అధికారులు. ఇక సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే ఓటు హక్కు సంరక్షణ కోసం సోమవారం దిల్లీలో భారీ ఆందోళన చేపట్టాలని ఇండీ కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications
