వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2023: ఆ రూల్ పై రిక్కీ పాంటింగ్ గుస్సా ... ఆటగాళ్లు మటాష్..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: మార్చి 31వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభం అవుతుంది. ఇప్పటికే పలు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ నిబంధనలతో కొంత వరకు లాభం అదే సమయంలో నష్టం కూడా ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇదే విషయమై ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఢిల్లీ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ స్పందించారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తీసుకొస్తే ఆల్‌రౌండర్లకు విలువ లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇంతకీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఏంటి..?

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన

ఐపీఎల్ 16వ సీజన్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రకారం మ్యాచ్ మధ్యలో అప్పటి పరిస్థితికి అనుకూలంగా ఒక బ్యాట్స్‌మెన్ లేదా ఒక బౌలర్‌ను రీప్లేస్ చేయొచ్చు. అంటే ప్లేయింగ్‌ ఎలెవెన్ జాబితాలో ఉన్న ఒక బ్యాట్స్‌మెన్‌ను అప్పటి మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తప్పించి మరో బ్యాట్స్‌మెన్‌ను మార్చుకునే వీలు ఉంటుంది.

బౌలర్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన రూల్‌తో పాటు డీఆర్ఎస్ రివ్యూలను కూడా మరింత విస్తరించారు. అలానే టాస్ వేసిన తర్వాత జట్టును కెప్టెన్ ప్రకటిస్తాడనే నిబంధన కూడా ఈ సీజన్‌ నుంచి అమల్లోకి వస్తుంది.

IPL 2023:Ricky ponting opposes the impact player rule,Know what the rule is

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై రిక్కీ పాంటింగ్ వెర్షన్

మ్యాచ్‌లో కొత్తదనం కోసం మరింత ఆసక్తికరంగా మలిచేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టారు. అయితే ఈ నిబంధనపై నిర్మొహమాటంగా తేల్చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్. ఈ నిబంధనలతో తరచూ క్రికెటర్లను మార్చడం వల్ల వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం చేశాడు రిక్కీ పాంటింగ్. వాస్తవానికి ఆల్‌రౌండర్స్ పై ఈ ప్రభావం తీవ్రంగా చూపుతుందని చెప్పారు.

ఒక ఆల్‌రౌండర్ కూడా లేకుండా బ్యాట్స్‌మెన్ బౌలర్లతో జట్టును ప్రకటిస్తారు. ఆ తర్వాత మ్యాచ్ పరిస్థితి అనుకూలంగా లేకుంటే ఒక బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్‌లను తప్పించి మరొకరిని తీసుకురావడం అనే కాన్సెప్ట్ పై తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లు రిక్కీ పాంటింగ్ చెప్పాడు.

ఈ ఆప్షన్‌ను చాలా జట్లు వినియోగించరని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆటగాళ్ల వేలంపాట తర్వాత ఈ నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ ముందే తెలిసుంటే పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పారు. ఇదిలా ఉంటే రిషబ్ పంత్‌ను ఎవరూ రీప్లేస్ చేయలేరని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

English summary
Ricky Ponting has opposed the Impact player rule in the IPL 2016 season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X