భూమి మీద నూకలు ఉండటం అంటే ఇదేనెమో., మూడు పల్టీలు కొట్టిన కారు, బెలూన్లు ఓపెన్ కావడంతో..

అవును.. కొన్ని కొన్ని ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తాయి. ఆ సమయంలో యమ ధర్మరాజు సెలవులో ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతోంది. అచ్చం ఇలాంటి ప్రమాదమే సోమవారం అర్దరాత్రి జగిత్యాల పట్టణంలో జరిగింది. ఆ ఫుటేజీ చూస్తే చాలు చూసిన వారు కూడా భయపడిపోతారు. కానీ సమయానికి బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రమాద ఘటన మాత్రం వారికి నిద్రలో గుర్తుకొచ్చినా.. వణికిపోతుంటారు.

అర్ధరాత్రి బైపాస్ రోడ్‌లో ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. మూడు పల్టీలు కొట్టి.. ఆగిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో అందులో ముగ్గురు ఉన్నారు. అయితే సమయానికి బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని చూస్తే.. ఒళ్లు జలదరిస్తోంది. కారు పల్టీలు కొట్టిన యువకులు ఎలా బయటపడ్డారనే అనుమానం కలుగుతోంది.

bizarre accident at jagtial bypass road, car flipped over..

వారు జగిత్యాలకు చెందినవారీగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు యువకులు విద్యానగర్‌కు చెందినవారు అని గుర్తించారు. కారు ప్రమాదంలో ముందుభాగం దెబ్బతిన్నది. కానీ అందులో ప్రయాణిస్తున్న వారికి మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

బైపాస్ రోడ్డులో కారు పల్టీ కొట్టిన సమయం అర్ధరాత్రి కావడంతో ప్రమాదం తప్పింది. అందులో ఉన్నవారికి ఏమీ కాకపోయినా.. ఆ సమయంలో ఇతర వాహనాలు రావడం లేదు. వాహనాలు/జనం లేక రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఒకవేళ మరో వాహనం ఎదురొస్తే పరిస్థితి మరోలా ఉండేది. జనం ఉన్న.. పరిస్థితిని ఊహించలేం. కానీ కారు పల్టీలు కొట్టి.. ముందుభాగం దెబ్బతినడంతో.. అందులో ఉన్నవారు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+