• search
  • Live TV
జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఘోరం: మంత్రాల నెపంతో అందరూ చూస్తుండగానే తండ్రి, ఇద్దరు కుమారులను పొడిచి చంపారు

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ఓ వైపు ప్రపంచం శాస్త్రసాంకేతిక రంగాల్లో అనేక విజయాలను సాధిస్తూ ఆధునిక పోకడలను అనుసరిస్తుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో మూఢనమ్మకాలు అమాయకుల ప్రాణాలను తీస్తున్నాయి. జగిత్యాలలో మంత్రాల నెపంతో ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడం గమనార్హం.

బతికుండగానే తల్లిని స్మశాన వాటికకు తరలించిన కొడుకు || A Man Shifted His Alive Mother To Graveyard
అందరూ చూస్తుండగానే తండ్రీకొడుకుల హత్య

అందరూ చూస్తుండగానే తండ్రీకొడుకుల హత్య


జగిత్యాలలో జరిగిన హత్యల ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథం నాగేశ్వర్‌రావు(60) కుటుంబంతో కలిసి ఎరుకలవాడలో ఉంటారు. కుమారుల కుటుంబాలు కూడా సమీపంలోనే ఉంటాయి. ఆరు నెలలకోసారి స్థానికంగా కులసంఘం సమావేశం ఉండటంతో గురువారం ఆయనతోపాటు పెద్దకొడుకు రాంబాబు(35), రెండో కుమారుడు రమేశ్‌(25), మూడో కుమారుడు రాజేశ్‌ వెళ్లారు. అక్కడే మహిళలు వేరేగా సమావేశం నిర్వహించుకుంటున్నారు. నాగేశ్వర్‌రావు, ఆయన కుమారుల కుటుంబాలకు చెందిన మహిళలు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు.
అప్పటికే కుల సంఘం సమావేశంలో కాచుకు కూర్చున్న కొందరు.. ఒక్కసారిగా నాగేశ్వర్‌రావు.. ఆయన ముగ్గురు కుమారులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే ఇద్దరు రక్తపు మడుగులో అచేతనంగా పడిపోగా మరొకరు తీవ్రగాయాలతో విలవిల్లాడిపోతూ కనిపించడం చూసి గుండెలవిసేలా రోదించారు వారి కుటుంబసభ్యులు. నాగేశ్వర్‌రావు, రాంబాబులను ఛాతి, గొంతు భాగంలో బలంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

మంత్రాల నెపంతోనే దారుణ హత్యలు

మంత్రాల నెపంతోనే దారుణ హత్యలు

కాగా, నాగేశ్వర్ రావు మరో కుమారుడు రాజేశ్‌ దుండగుల దాడి నుంచి తప్పించుకుని పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరుగురికిపైగా వ్యక్తులు ఈ దారుణంలో భాగమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పక్కాగా ప్రణాళికపక్కా ప్రణాళిక ప్రకారమే హంతకులు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే వారు సంఘ సమావేశానికి హాజరై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఆయుధాలతో తెగబడ్డారని భావిస్తున్నారు. నాగేశ్వర్‌రావు కుటుంబంతో కొన్నాళ్లుగా వైరం ఉన్న వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, ముఖ్యంగా మంత్రాల నెపంతోనే ఈ ఘోరానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎరుకల వాడలో కుల పెద్దగా ఉంటున్న నాగేశ్వర్‌రావు సహా ఆయన కుటుంబీకులు మంత్రాలు చేస్తున్నారని కొంతమందిలో అనుమానాలున్నాయి. నెలరోజుల కిందట సిరిసిల్ల జిల్లా ఆగ్రహారం సమీపంలోని ఓ శ్మశాన వాటిక వద్ద ఈ కారణంగానే నాగేశ్వర్‌రావుపై దాడి జరిగింది. కేసు కూడా నమోదైంది. వారం రోజుల కిందట ఎరుకల వాడలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె మృతికి వీరు చేస్తున్న మంత్రాలే కారణమని భావించిన వైరివర్గాలు ఈ హత్యలకు పాల్పడి ఉంటారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు.

ముగ్గురి హత్య కేసులో 8 మందిపై ఎఫ్ఐఆర్.. పలువురి అరెస్ట్

ముగ్గురి హత్య కేసులో 8 మందిపై ఎఫ్ఐఆర్.. పలువురి అరెస్ట్

కాగా, నాగేశ్వర్‌రావు భూముల క్రయవిక్రయాలు, వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆయనకు ఇద్దరు భార్యలు- సుఖమ్మ, కనుకమ్మ. రాంబాబుకు భార్య సారమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, రమేశ్‌కు భార్య సౌజన్య ఉన్నారు. మృతిచెందిన అన్నదమ్ములిద్దరు సెప్టిక్‌ ట్యాంకును నడిపిస్తూ జీవనాన్ని సాగిస్తుండేవారు. కాగా, జగిత్యాలలో ముగ్గురి హత్య కేసులో 8 మందిపై పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోచయ్య, శేఖర్, కందుల రాములు, పల్లాని భూమయ్య, కందుల శ్రీనుపై కేసు నమోదయింది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జగిత్యాలలో మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్త్ చేపట్టారు. టీఆర్​నగర్​లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇది ఇలావుండగా, జనగామ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తీగారంలోని కాషాగూడెంలో బుధవారం రాత్రి మంత్రాల నెపంతో ముగ్గురిపై దాడి చేశారు.

English summary
Man and his two son hacked To Death In Jagtial twon Over Suspicion Of Black Magic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X