జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ అరెస్ట్: తెలంగాణలో ఏం జరుగుతోంది?

|
Google Oneindia TeluguNews

జనగామ: ఢిల్లీలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రమేయం ఉన్నట్లుగా చెబుతోన్నలిక్కర్ పాలసీ కుంభకోణం ప్రకంపనల తాకిడి తెలంగాణలో సంచలనాన్ని రేపుతోంది. ఇక్కడి రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.. కుదిపేస్తోంది. ఈ మద్యం కుంభకోణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితతో సంబంధాలు ఉన్నట్లు భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.

పరువు నష్టం దావా కోసం..

పరువు నష్టం దావా కోసం..

బీజేపీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, ఆయనపై చట్టపరమైన చర్యలను తీసుకోబోతోన్నానంటూ ఇదివరకే కవిత ప్రకటించారు. న్యాయస్థానంలో పరువునష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. అదే సమయంలో కవితపై తక్షణమే చర్యలను తీసుకోవాలంటూ అటు తెలంగాణ బీజేపీ నాయకులు ఆమె ఇంటిని ముట్టడించడం, భారీ సంఖ్యలో వారు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇంటి వద్ద ఉద్రిక్తత..

దీనికి పోటీగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా సహా టీఆర్ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమె నివాసానికి చేరుకున్నారు. నైతిక మద్దతు ప్రకటించారు. ఇవ్వాళ కూడా బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో కవిత నివాసానికి తరలిరావడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఫలితంగా తోపులాట సంభవించింది. లాఠీఛార్జీని చేయాల్సి వచ్చింది.

రాష్ట్రవ్యాప్త ఆందోళన..

అదే సమయంలో- ఈ లిక్కర్ కుంభకోణానికి వ్యతిరేకంగా ఇవ్వాళ బీజేపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి ప్రయత్నించారు. ర్యాలీలు, ప్రదర్శనలకు సమాయాత్తం అయ్యారు. వారిని పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పలువురు నాయకులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు.

బండి సంజయ్ అరెస్ట్..

జనగామ జిల్లా పామునూరు దీక్షాశిబిరం వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన పామునూరులో ఉన్నారు. అక్కడే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో పాల్గొనడానికి వచ్చిన వారిని అదుపులో తీసుకున్నారు.

హైకమాండ్ ఆరా..

ఈ పరిణామాలపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్.. కొద్దిసేపటి కిందటే బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకుల అరెస్టులకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్త బంద్‌ను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఈ మధ్యాహ్నం నాటికి స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. బండి సంజయ్ సహా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తరుణ్ ఛుగ్ తప్పుపట్టారు.

English summary
Telangana BJP Chief Bandi Sanjay arrest and other leaders were house arrested across the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X