వైసీపీకి 130 స్థానాలు గ్యారెంటీ .. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది అంటున్న కాటసాని
చంద్రబాబు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమన్నారు వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి . కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 130 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజలను ఆకర్షించాయని రాంభూపాల్ రెడ్డి చెప్పారు .

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. అందుకే చంద్రబాబు ప్రస్తుతం ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే ఏపీకి న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. జగన్ సీఎం అవుతారని జాతీయ సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications