కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శని బీజేపీ, రాహు కేతువులు వైసీపీ, జనసేన: తులసీరెడ్డి నిప్పులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. ఆ పార్టీ నేతలు ఆడపా దడపా వార్తలో ఉంటున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ శని గ్రహణం అయితే.. వైసీపీ, జనసేన రాహు కేతువుల్లా తయారయ్యాయని అన్నారు. గురువారం ఆయన కడప జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

ఎవరినీ వదలలే..

ఎవరినీ వదలలే..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యపానం నిషేధిస్తామని ఎన్నికల హామీ ఇచ్చారని.. అయితే ఇప్పుడు సొంత బ్రాండ్‌లతో మద్యంపై అత్యధిక సంపాదన రాబడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మద్యపాన నిషేధం హామీని అమలు చేస్తారా లేక మాట తప్పిన వారిలా మిగిలిపోతారా అంటూ తులసిరెడ్డి కామెంట్ చేశారు. రాష్ట్రంలో కల్తీ సారా లేదంటూనే.. కోట్ల లీటర్ల సారా ధ్వంసం చేశామని అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పడం చూస్తుంటే ప్రభుత్వం ఎంతటి అబద్దాలు చెబుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

 శని గ్రహణాలు, రాహు కేతువులు

శని గ్రహణాలు, రాహు కేతువులు


రాష్ట్రానికి బీజేపీ శని గ్రహణం అయితే వైసీపీ, జనసేన రాహు కేతువులుగా మారారని తులసిరెడ్డి అన్నారు. రాయలసీమకు బీజేపీ ద్రోహం చేసిందని..ప్రత్యేక ప్యాకేజి అంటూ ఏపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. అలాంటి బీజేపీ నుంచి జనసేన రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడడం అంటూ తులసిరెడ్డి ఫైరయ్యారు. జనసేన బీజేపీ రోడ్ మ్యాప్ అడగడం కంటే బీజేపీలో విలీనం చేస్తే మంచిదని ఎద్దేవాచేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కేంద్రం చేతులో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు.

భారం

భారం


జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ అని, వాటి ధరలు అమాంతం పెంచేసిన బీజేపీ ప్రభుత్వం జనంపై మోయలేని భారం వేసిందని విమర్శించారు. గ్యాస్ ధరలు చూసి వంటింట్లోకి వెళ్లాలంటే మహిళలు భయపడి పోతున్నారని తులసిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయని సాకులు చెబుతూ ధరలు పెంచుతున్నారని, కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగినా అప్పటి ప్రధాని మన్మోహన్ మాత్రం దేశంలో ధరలు పెంచలేదని తులసిరెడ్డి గుర్తు చేశారు.

English summary
congress leader tulasi reddy criticises bjp, ysrcp, janasena. they all parties are cheating people he alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X