18 వేల కోట్ల పెట్టుబడి : 3మిలియన్‌ టన్నుల ఉత్పత్తి : క‌డ‌ప ఉక్కుకు సీయం శంకుస్థాప‌న‌..

కేంద్రం ద‌యా ద‌యాక్షిణ్యాల పై ఆధార ప‌డ‌కుండా ఏపి శ‌క్తి చాటేందుకు ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు ఏపి ముఖ్య‌మం త్రి శంకుస్థాప‌న చేసారు. క‌డ‌ప జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. 2700 ఎకరాల్లో రూ.18వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరుగనుంది.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వమే సొంతంగా స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఏళ్ల తరబడి సీమవాసుల ఆకాంక్షగా ఉన్న ఉక్కు పరిశ్రమకు చంద్రబాబు ఇవాళ శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మైలవరం మండలం, కంబాలదిన్నెవద్ద కడప ఉక్కు ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి శంఖుస్థాప న చేసారు. రూ. 18వేల కోట్ల పెట్టుబడితో, మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆకాంక్ష ఇప్పటిది కాదు. పదేళ్ల క్రితమే 'బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ' పేరిట ఆ దిశగా అడుగులు పడ్డాయి.

Foundation for Rayalaseema steel factory : rs 18000 cr investment..

పదివేల ఎకరాల్లో నిర్మించేందుకు అనుమతులు లభించినా అనివార్య కారణాలతో అది అసంపూర్తిగా మిగిలింది. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టం హామీల్లో కడప ఉక్కు ప్రస్తావన రావడం తెలిసిందే. కేంద్రం పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఏళ్ల తరబడి కాలయాపనే జరిగింది. దీని పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేంద్రానికి అనేక ప్ర‌తిపాద‌న‌లు ముందుకు తెచ్చారు. అయితే, క‌డ‌ప లో స్టీల్ ఫ్యాక్ట‌రీ కి ఫీజ‌బులిటీ లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది.

కేంద్రానికి చెంప పెట్టు..

క‌డ‌ప లో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోసం రాజ‌కీయ పార్టీలు..నేత‌లు ప‌లు మార్లు కేంద్రాన్ని అభ్య‌ర్ధించారు. అయినా..వారి నుండి స్పంద‌న రాలేదు. మెకాన్‌ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా కేంద్రం బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

దీనికి 'రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌'గా నామకరణం చేశారు. ప్రొద్దుటూరులో ధర్మపోరాట వేదికపై ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావించిన చంద్రబాబు...నాడు చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా నేడు శంకుస్థాప‌న చేసారు. ఇదే స‌మ‌యంలో..టిడి పి ఎంపి సీయం ర‌మేష్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాప‌న జ‌రిగే వ‌ర‌కు గ‌డ్డం తీయ‌న‌ని శ‌ప‌ధం చేసారు. నేటితో సీయం ర‌మేష్ శ‌ప‌ధం కూడా నెర‌వేర‌నుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+