వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ స్పీడప్, బీటెక్ రవికి సిట్ నోటీసులు, ఆదినారాయణ కూడా..?
వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణను స్పీడప్ చేసింది. హత్య కేసుకు సంబంధించి అనుమానితులందరీని విచారిస్తోంది. గత 9 నెలల నుంచి కేసు విచారణను దర్యాప్తు బృందం చేస్తుంది. ప్రతీరోజు రెండు పార్టీలకు చెందిన నేతలను పిలిచి మరీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు అధికారులు పేర్కొన్నారు.

మిగతావారికి నోటీసులు
వివేకా హత్య కేసులో అనుమానితులు చెప్పిన వివరాలను బట్టి మిగతావారికి నోటీసులు జారీచేస్తున్నారు. విచారణకు హాజరుకావాలని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి నోటీసులు జారీచేశారు. గురువారం బీటెక్ రవిని అధికారులు ప్రశ్నిస్తారు. విచారణలో ఆయన చెప్పే సమాధానాలను బట్టి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవర్ దస్తగిరి విచారణ
బుధవారం డ్రైవర్ దస్తగిరి, ప్రకాశ్‌ను సిట్ అధికారులు విచారించారు. వివేకా హత్య కేసుకు సంబంధించి విచారణ తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో కొందరు అనుమానితులను పుణె తీసుకెళ్లి నార్కొ అనాలిసిస్ టెస్ట్ కూడా చేశారు. కానీ హత్యకు సంబంధించి నిందితులను మాత్రం కనుగొనలేకపోయారు.

స్పీడ్ తగ్గి.. అంతలోనే
వివేకానంద హత్య కేసు విచారణ మధ్యలో వేగం తగ్గింది. దీంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం సొంత బాబాయ్ హత్య నిందితులను పట్టుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. దీంతో ఎంక్వైరీ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో... సిట్ తన దర్యాప్తు స్పీడ్ మరింత పెంచింది.

బంధువుల విచారణ
కేసులో ఇప్పటికే వైఎస్ మనోహర్ రెడ్డి, టీడీపీ నేత కోరటి ప్రభాకర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా మిగతావారికి నోటీసులు జారీచేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి, టీడీపీ నేత శివరామిరెడ్డిని కూడా ఎంక్వైరీ చేశారు. భాస్కర్ రెడ్డి, పనిమనిషిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు సందేహం కలిగిన వ్యక్తుల గురించి వారు తెలియజేయగా.. వారికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications