ఆ పెద్దలు ఎవరో.. సీబీఐ వెల్లడించాలి: మాజీ మంత్రి డీఎల్
వైఎస్ వివేకానంద హత్య కేసు సీబీఐ విచారణ తుది దశకు చేరుకుంది. మృతిపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. పెద్దల హస్తం ఉందని తొలి నుంచి కామెంట్లు వస్తున్నాయి. కానీ వారు ఎవరనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ నిష్పాక్షిపాతంగా దర్యాప్తు జరుపుతుందని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. కడప జిల్లా ఖాజీపేటలో మీడియాతో మాట్లాడారు.

పెద్దల హస్తం..
వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంలో ఇద్దరు పెద్దల హస్తం ఉందనే ప్రచారంపై సీబీఐ నిగ్గుతేల్చాలని కోరారు. పులివెందులలో వైసీపీ నేతల ప్రమేయంపై ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. వైసీపీ నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకోవడానికి సజ్జల రామకృష్ణా రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారని డీఎల్ ఆరోపించారు. వివేకా హత్యకేసును సునీత కుటుంబంపైకి నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సునీత కుటుంబానికి ఏ పాపం తెలియదని అనుకుంటున్నానని పేర్కొన్నారు.

నిందితులకు శిక్ష తప్పదు
వివేకా హత్య కేసులో నిందితులెవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. బాబాయి హత్యకు గురైతే జగన్ మాత్రం సాయంత్రం చేరుకోవడాన్ని ఏమనాలి? అని డీఎల్ ప్రశ్నించారు. నిందితులను కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని వెల్లడించారు. పూర్తి విషయాలు బహిర్గతం అయ్యాక కూడా టీడీపీ నేతలను ఎందుకు ప్రశ్నిస్తున్నారని కామెంట్ చేశారు. సీబీఐ విచారించాక కూడా ఆ నిందను టీడీపీకి ఆపాదించడం ఏమిటని మండిపడ్డారు. వివేకా హత్య కేసును చంద్రబాబుకు చుట్టడం సరికాదని స్పష్టం చేశారు. సీబీఐకి వైఎస్ కుటుంబంపై ఏమైనా కక్ష ఉంటుందా? అని బీటెక్ రవి ప్రశ్నించారు. వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐకి తెలుసని వెల్లడించారు. వివేకాను హత్య చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు.

తప్పని అరెస్టులు
వివేకానంద హత్య కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మరికొందరు ప్రముఖులను అరెస్ట్ చేయాల్సి ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఇటు వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ ఉండొచ్చంటూ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం తెలిసిందే.












Click it and Unblock the Notifications