కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు షాక్, బీజేపీలోకి కటకం మృత్యుంజయం, బండి సంజయ్ సమక్షంలో చేరిక
కరీంనగర్‌లో బీజేపీ బలపడుతోంది. బండి సంజయ్ తన ఇలాకాలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. తర్వాత రాష్ట్రంలో కీలక నేతలను పార్టీలో చేర్చుకొని.. బీజేపీని తిరుగులేని రాజకీయశక్తిగా నిలిపేందుకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పట్లో ఎన్నికలు లేవు.. కానీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చేరికలపై ఇప్పటినుంచే వ్యుహరచన చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలింది. మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం పార్టీ మారారు. వాస్తవానికి ఆయన గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. శుక్రవారం బీజేపీ గూటికి చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ నేత జీ వివేక్ సమక్షంలో పార్టీలో చేరారు. మృత్యుంజయానికి నేతలు సాదర స్వాగతం పలికారు.

మృత్యుంజయం వర్గం మొత్తం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరింది. దీంతో బీజేపీకి కొంత బూస్ట్ ఇచ్చినట్లవుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీలో చేరేవారికి తగిన ప్రాధాన్యం ఉంటుందని భరోసానిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications