• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళిత ఉద్యోగులకు కూడా.. సామాజిక వివక్షకు స్వస్తి: దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ దళిత ఉద్యోగులకు దళితబంధును వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును వివరించారు. హుజూరాబాద్‌లో ఉన్న‌ ప్ర‌తి ఒక్క ద‌ళిత కుటుంబానికి రెండు నెల‌ల్లో డ‌బ్బులు అందజేస్తామన్నారు. హుజూరాబాద్ కాడ అంద‌రికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేయాలన్నారు. 25 ఏళ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ సమయంలో.. సిద్దిపేట ద‌ళిత చైత‌న్య జ్యోతి అని ప్రారంభించామని వివరించారు. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాట‌లు రూపొందించామని చెప్పారు. గత 25 ఏళ్ల నుంచి తన మెదడులో ఉందన్నారు. ప్ర‌పంచంలో అణ‌గారిన, అణిచివేయ‌బ‌డ్డ జాతులు ఎన్నో ఉన్నాయని వివరించారు. దేశంలో ద‌ళితుల మాదిరిగా ప్ర‌పంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివ‌క్ష‌కు గుర‌య్యాయని చెప్పారు. అంబేద్క‌ర్ పోరాటం వ‌ల్ల అన్ని ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయని సీఎం అన్నారు.

Recommended Video

If Dalit Bandhu scheme is not for Huzurabad by-election -Manda Krishna
సామాజిక వివక్ష..

సామాజిక వివక్ష..


ఇప్పటికీ సామాజిక వివ‌క్ష ఎదుర్కొంటున్నారు. ఈ బాధ నుంచి విముక్తి కావాలన్నారు. తెలంగాణ నుంచి చేసే ప‌ని దేశ‌మంతా వ్యాపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చేస్త‌మంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. రెండు నెల‌ల్లో హుజూరాబాద్‌లో ప‌థ‌కం అమ‌ల‌వుతుందన్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో హుజూరాబాద్ ద‌ళితులే ఆద‌ర్శం కావాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 17 ల‌క్ష‌ల పైచిలుకు ద‌ళిత కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. రైతుబంధు త‌ర‌హాలోనే ద‌ళిత బంధు వ‌స్త‌ోందని చెప్పారు గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులైన ద‌ళిత సోద‌రుల‌కు కూడా ద‌ళిత బంధు వ‌ర్తిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.

4 ఎకరాల భూమి ఉన్నవారికి రైతు బంధు

4 ఎకరాల భూమి ఉన్నవారికి రైతు బంధు

ఒకరికీ 4 ఎక‌రాల భూమి ఉంటే రైతుబంధు వ‌స్తుందని.... రైతుబంధు లాగే ద‌ళిత బంధు వ‌ర్తిస్తుందని చెప్పారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివ‌రి వ‌రుస‌లో ఉండి తీసుకోవాలన్నారు. ద‌ళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి మీద అప్పులు ఉన్నాయని వివరించారు. అలాంటి వారికి తొలి వ‌రుసలో ఇవ్వాలని కోరారు. అలా ఇచ్చుకుంటూ పోతామని.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ద‌ళితబంధు ఇచ్చే హామీ తనదన్నారు. రెండు పూట‌లు పస్తులుండే వాళ్లు ల‌క్ష‌ల మంది ఉన్నారని.. వారు ముందుగా తీసుకోవాలని కోరారు. అత్య‌ధికంగా జ‌నాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలేనని చెప్పారు. 75 ల‌క్ష‌ల జ‌నాభా ఉందని.. అతి త‌క్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలేనని చెప్పారు. ఇది ప్ర‌జాస్వామ్యం.. అయితే ప్ర‌జ‌లు ప్ర‌భువులు అయితే ద‌ళితులు ఎందుకు ప్ర‌భువులుగా లేరని ప్రశ్నించారు. ఈ వివ‌క్ష ఎన్ని శ‌త‌బ్దాలు కొన‌సాగాలని. ఇది సరికాదని సీఎం కేసీఆర్ చెప్పారు.

రైతుబంధు..

రైతుబంధు..

ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టానని గుర్తుచేశారు. రైతు బంధు కార్య‌క్ర‌మం బ్ర‌హ్మాండంగా నడుస్తోందని చెప్పారు. వ్య‌వ‌సాయ రంగంలో అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నామని.. తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగిందని వివరించారు. క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన స‌భ‌లో రైతుబీమా ప్ర‌క‌టించానని.. కేసీఆర్ గుర్తుచేశారు. ఆ స్కీం కూడా అద్భుతంగా కొన‌సాగుతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో మ‌హోత్త‌ర‌మైన, కొత్త చ‌రిత్ర‌ను సృష్టించే, త‌ర‌త‌రాల దోపిడీ నుంచి, సామాజిక వివ‌క్ష నుంచి ద‌ళిత స‌మాజం శాశ్వ‌తంగా విముక్తి పొందటానికి మరో ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. తెలంగాణ సాధ‌న‌లో తొలిసింహ గ‌ర్జ‌న నుంచి నేటి వ‌ర‌కు సెంటిమెంట్‌గా బ్ర‌హ్మాండ‌మైన పద్ధతుల్లో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌యం చేకూరే వేదిక‌గా కరీంనగర్ జిల్లా మారిందని వివరించారు.

అంబేద్కర్.. జగ్జీవన్ రామ్...

అంబేద్కర్.. జగ్జీవన్ రామ్...


ఇక్కడి నుంచే అద్భుత‌మైన ఉద్య‌మానికి శ్రీకారం చుడుతున్నానని వివరించారు. మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవన్ రామ్‌కు పుష్పాంజ‌లి ఘ‌టించి శ్రీకారం చుడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ద‌ళితబంధు ప్ర‌భుత్వ కార్యక్రమం కాదు. కాకూడ‌దు అన్నారు. ఇది ఒక మ‌హా ఉద్య‌మం. ఈ ఉద్య‌మం క‌చ్చితంగా విజ‌యం సాధించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన సమయంలో చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవన్నారు. మీ అంద‌రి దీవ‌నెలు, ఆశీర్వాదాలతో రాష్ట్రం న‌లుమూలుల ఉద్య‌మం ఉవ్వెత్తున చెల‌రేగి 14, 15 సంవత్సారల కృషి త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఇవాళ స‌గ‌ర్వంగా దీవిస్తున్నారని.. అనేక రంగాల్లో అద్భుత‌మైన విజ‌యాలు సాధించాం అని చెప్పారు. ప్ర‌తి రోజు ప్ర‌తి నిత్యం మీ కళ్ల ముందు గ్రామాల్లో, మండ‌లాల్లో, మీ అనుభ‌వంలో చాలా కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.

పైలట్ ప్రాజెక్టు

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.

పెదవి విరిచిన విపక్షాలు

పెదవి విరిచిన విపక్షాలు

దళిత బంధు పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

English summary
dalith government employees also eligible dalitha bandhu scheme cm kcr said. dalitha bandhu is model of rythu bandhu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X