Ponnam Vs Bandi: బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి, ఎంపీపై పొన్నం ఫైర్
కరీంనగర్/హనుమకొండ: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఎంపీ బండి సంజయ్ సాగుతోంది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల పొన్నం చేసిన వ్యాఖ్యలపై బండి.. బండి చేసిన వ్యాఖ్యలకు పొన్నం ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి బండి సంజయ్ యాత్రపై దాడి జరిగింది.
హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం వంగరలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాన్వాయ్‌పై బుధవారం కోడిగుడ్ల దాడి జరిగింది. ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఇంటిని సందర్శించారు. అనంతరం ముల్కనూర్ బయల్దేరుతుండగా ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో.. అవి కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలో మండిపడుతున్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే కోడిగుడ్లతో దాడి జరిగినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత అక్కర్లేదని.. పోలీసులు తనతో రావద్దని.. తన రక్షణ తమ కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ సీరియస్ అయ్యారు.
In the name of Indiramma Rajyam, Congress got Goonda Raj in Telangana.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 28, 2024
Congress is unable to digest the fact that @BJP4India led Central government honoured Former PM PV Narasimha Rao with Bharat Ratna
They are attacking us for visiting his native place Vangara,Husnabad of… pic.twitter.com/xrmcHl6kxG
మరోసారి బండిపై విమర్శలు గుప్పించిన పొన్నం
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. బండి వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. 'గంగుల కమలాకర్, బండి సంజయ్ ఎన్నికల్లో కుమ్మక్కు అయ్యారు. నేను రాముడి గురించి చెడ్డగా మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధం. రాముడిని ఆరాధిస్తా, నేను పక్కా హిందువును' అని పొన్నం చెప్పుకొచ్చారు.
Bandi Sanjay
— Congress for Telangana (@Congress4TS) February 28, 2024
Be Careful.., You spoke in a way that insulted my mother.
-- Minister Ponnam Prabhakar
👉 బండి సంజయ్ గారు ఏ తల్లి అయిన నవ మాసాలు మోసి బిడ్డను కంటుంది..
👉 తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడావు..
👉 నా తల్లి కావచ్చు..నీ తల్లి కావచ్చు ఏ తల్లి అయినా పైగా బతికి ఉన్న నా… pic.twitter.com/ejg7zTwg5W
'రాముడిని ఆరాధిస్తున్నానని చెప్పి మీరు దేవుడినే రాజకీయాల్లోకి లాగుతారా? హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నిస్తే నా తల్లి గురించి మాట్లాడతారా? మళ్లీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో హుస్నాబాద్ చౌరస్తాలో ఆయురారోగ్యాలతో ఉన్న నా తల్లి ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడతారా? తల్లిని ఎవరైనా రాజకీయాల్లోకి లాగుతారా? చెప్పండని.. తెలంగాణ ప్రజలు, బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నాను. మీరు ఎంపీగా గెలిస్తే నన్ను మంత్రికి పదవికి రాజీనామా చేయమంటున్నారు. మీరు ఇప్పటికీ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మరి ఎంపీ పదవికి రాజీనామా చేశారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
అంతకుముందు పొన్నం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఏమన్నారంటే..?
'అయోధ్యలో రామమందిరం కట్టారు, అక్షింతల పేరుతో రేషన్ బియ్యం పంచుతున్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని నమ్మకం ఏంటి అని పొన్నం ప్రభాకర్ అడుగుతున్నారు. అయితే నేనూ ఒకటి అడుగుతున్నానంటూ పొన్నంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.
ఈ క్రమంలో బండి సంజయ్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. ఏదో అలజడి సృష్టించి, యాత్రను అడ్డుకోవాలనుకుంటే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో నిలబెట్టాలని, ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే పొన్న సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు బండి సంజయ్.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications