Etela Rajender: కర్ణాటక నుంచి రాజ్యసభకు ఈటల.. కేంద్రమంత్రి పదవీ, జోరుగా ప్రచారం
టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. మరికొద్దీ రోజుల్లో బీజేపీలో చేరతారు. ఇదీ కన్ఫామ్.. అయితే ఆయన భవిష్యత్ ఏంటీ అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచి హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారని.. విజయం కోసం కష్టపడతారని తెలుసు. కానీ అదీ అలా ఉంటే మరో ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఆయన హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగరని టాక్ వినిపిస్తోంది. సతీమణీ జమున అక్కడినుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతారని టాక్ నడుస్తోంది.

మరీ ఈటల రాజేందర్
ఒకవేళ జమున హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే మరీ ఈటల రాజేందర్ ఏంటీ అనే ప్రశ్న సహజంగానే వస్తోంది. ఆయనను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపిస్తారట. దీనికి సంబంధించి ఈటలకు బీజేపీ హై కమాండ్ మాట ఇచ్చిందని తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఇవ్వడమే గాక.. కేంద్రమంత్రి వర్గంలోకి కూడా తీసుకుంటారని ఇన్ పుట్స్ వస్తున్నాయి. సహాయ మంత్రి పదవీ ఇచ్చి.. తెలంగాణలో మరింత బలపడాలని బీజేపీ ప్లాన్ అని అర్థమవుతోంది.

లాభ నష్టాల బేరీజు
ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో తమ పార్టీకి కూడా ప్లస్ అవుతోందని బీజేపీ అనుకుంటోంది. ఇప్పటికే ఉన్న నేతలతోపాటు ఈటల.. ఆయన సహచరులతో కమల దళం మరింత బలపడనుంది. వచ్చే ఎన్నికల నాటికి ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చని బీజేపీ ప్రణాళిక రచించింది. అందులో భాగంగానే ఈటలకు రాజ్యసభ, కేంద్రమంత్రి పదవీ ఆఫర్ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇటు ఈటల రాజేందర్ కానీ అటు బీజేపీ కానీ అధికారికంగా స్పందించలేదు.

ఇప్పటికీ అయితే ఓకే.. కానీ
మొత్తానికి ఈటల అనే తుట్టేను కేసీఆర్ గెలికినట్టే అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన పార్టీలోకి వెళ్లి కొరకరాని కొయ్య అవుతారని చెబుతున్నారు. ఈటల/ బీజేపీ ఇద్దరీ శత్రువు ఒక్కరే అవుతారని.. దీనిని కేసీఆర్ అండ్ కో ఫేస్ చేయాల్సి ఉంటుందని లెక్క కడుతున్నారు. వీరితో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికప్పుడు నష్టం ఉండకపోవచ్చు.. కానీ అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications