జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. కౌన్సిలర్‌పై కత్తులతో దాడి..!

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి కలకలం రేగింది. 15వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల శ్రీను అలియాస్ కోర్టు శ్రీనుపై హత్యాయత్నం జరిగింది. అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు కత్తులతో దాడి చేశారు. విచక్షణరహితంగా వేటు వేయడంతో శ్రీను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఐదుగురు వ్యక్తులు కత్తులు వెంటబెట్టుకుని అర్ధరాత్రి సమయంలో శ్రీను ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. దుండగులు అకస్మాత్తుగా దాడిచేయడంతో శ్రీను తప్పించుకోవడానికి వీలుపడలేదని సమాచారం. దాంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు శ్రీను ఇంటికి వచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

mid night tense in jagtial councillor attacked by unknown persons

పాతకక్షల నేపథ్యంలో శ్రీనుపై దాడి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+