నెక్ట్స్ టార్గెట్ హరీశ్ రావే.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
హుజురాబాద్ ప్రచార పర్వం హోరెత్తింది. నేతల మధ్య కౌంటర్ అటాక్ జరుగుతోంది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్‌ఎస్‌లో నెక్ట్స్ బలయ్యేది హరీష్ రావేనని పేర్కొన్నారు. హరీష్ రావుపై కేసీఆర్ టార్గెట్ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకే హుజురాబాద్ బై పోల్ బాధ్యతలు అప్పగించారా అనే అనుమానం కలుగుతుంది. కానీ ఈ కామెంట్స్ నిజమో కాదో తెలియదు. మరింత సమయం పడితే నిజ నిజాలు తెలిసే ఛాన్స్ ఉంది.

మంచోడే
హరీశ్ మంచోడే.. కానీ అబద్దాలు మాట్లాడకు అని కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ.. మరొకటి మీడియా ముందు అబద్దాలు మాట్లాడే కమిటి అని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరూ ఏం చేస్తారో తెలిసే ఛాన్స్ ఉంది. కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? వేల కోట్లతో హుజురాబాద్‌లో గెలవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.

విజయమో
హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

బ్రేక్
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications